అంబటి అల్లుడి హల్ చల్.. దేశం శ్రేణులు తిరగబడడంతో పరార్!
posted on May 13, 2024 3:25PM
ఎక్కడ చూసినా వైసీపీ మూకలు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. గెలుపు ఆశలు వదిలేసుకున్న వైసీపీ హింసాకాండతో పోలింగ్ సజావుగా సాగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బరి తెగించేస్తోంది. అయితే వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు బెదరకుండా ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద ఎక్కడకక్కడ తిరగబడుతున్నారు.
దాడులకు భయపడం ఓటేసి తీరుతాం అంటూ ప్రతిన చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు పోటీ చేస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన అల్లడు ఉపేష్ చౌదరి హల్ చల్ చేశారు. ముప్పాళ్ల మండలం నార్నెపాడు గ్రామంలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. అనుచిత భాషతో దూషిస్తూ విరుచుకుపడ్డారు. అక్కడ ఉన్న పోలీసులను పిలిచి తెలుగుదేశం నా కొడుకులందర్నీ అక్కడ నుంచి తరిమేయాలంటూ యాజ్ ఇఫ్ ఆయనే పోలీస్ బాస్ లా హుకుం జారీ చేశారు.
దీంతో తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడ్డారు. మీ పెత్తనం ఏమిటి? నీ దౌర్జన్యం ఏమిటంటూ తిరగబడ్డారు. ఉమేష్ చౌదరి అనుచరులు కారులోంచి కర్రలు, రాడ్లు తీసుకువచ్చి దాడికి యత్నించగా తెలుగేశం కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో అంబటి అల్లుడు ఉపేష్ చౌదరి తన అనుచరులతో అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు.