అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ 

సినీ హీరో అల్లు అర్జున్ కు  శుక్రవారం నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు  రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ను  నాంపల్లి కోర్టు నుంచి చెంచల్ గూడ జైలుకు తరలించారు.  సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో  రేవతి అనే  మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు.  మరో వైపు రేవతి భర్త కేసును విత్ డ్రా చేసుకుంటానని, తన భార్య చనిపోవడానికి అల్లు అర్జున్ కు సంబంధం లేదని అన్నారు. రేవతి కుటుంబానికి  అల్లు అర్జున్ ఇప్పటికే 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే