నరేంద్రమోడీ విమానం దారి మళ్ళింపు!
posted on Jul 18, 2014 11:43AM
.jpg)
మలేసియా విమానాన్ని ఉక్రెయిన్‌లో ఉగ్రవాదులు కూల్చేసి 295 మంది ప్రయాణికుల మృతికి కారణమైన నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణించే పలు విమానాలను దారి మళ్ళించి, ఇతర మార్గాల్లోంచి నడుపుతున్నారు. అలా దారి మళ్ళించిన విమానాల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్నన ఎయిర్ ఇండియా వన్ విమానం కూడా వుంది. బ్రెజిల్‌లో బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఆయన ఎయిర్ ఇండియా వన్ విమానంలో తిరిగి వస్తున్న సమయంలో ఆయన విమానాన్ని కూడా వాస్తవానికి ఉక్రెయిన్ మీదుగుండానే నడపాల్సింది. అయితే అధికారులు ప్రధాని విమానాన్ని కూడా మరో మార్గంలో నడిపించారు. గురువారం రాత్రి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత నరేంద్రమోడీ ఉక్రెయిన్ విమాన విమాన ప్రమాదం పట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.