రాజమౌళి శిష్యుడే విక్రమార్క తీసాడు..అగస్ట్ 30 న అన్ని బయటకి వస్తాయి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 2009 లో వచ్చిన మూవీ మగధీర.ఇందులో రణదేవ్ బిల్లా అనే కరుడుగట్టిన విలనిజంతో  ప్రేక్షకులని  మెప్పించిన నటుడు దేవ్ గిల్. ఆ తర్వాత పూల రంగడు, రగడ, రచ్చ, ప్రేమ కావాలి, నాయక్ వంటి చిత్రాల్లో మెరిశాడు. తమిళ, మలయాళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోను చాలా చిత్రాలు చేసాడు. ఇప్పుడు  సోలో హీరోగా రూటు మార్చాడు. దీంతో  సోషల్ మీడియాలో ప్రత్యేక అతిధిగా ల్యాండ్ అయ్యాడు.

దేవ్ హీరోగా తెరకెక్కిన మూవీ  అహో విక్రమార్క. ఒక పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు.  కొన్ని రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్ తో అందరిలో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. రాజమౌళి చేతుల మీదుగా టీజర్ లాంచ్  విడుదల అయ్యింది.దీంతో అందరి దృష్టి విక్రమార్క మీద పడింది. ఇప్పుడు ఈ మూవీ అగస్ట్ 30 న రిలీజ్ అవుతుంది. ఈ మేరకు  మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. ఇక  రాజమౌళి దగ్గర చాలా సంవత్సరాలు దర్శకత్వ శాఖ లో పని చేసిన పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన గతంలో జువ్వ, దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాలకి దర్శకత్వం వహించాడు. ఆస్కార్ అందుకున్న  ఆర్ఆర్ఆర్ కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా చేసాడు.

చైత్ర శుక్ల హీరోయిన్ గా వస్తున్న అహో విక్రమార్కలో షాయాజీ షిండే, బిత్తిరి సత్తి, బాహుబలి ప్రభాకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కేజఎఫ్ సంచలనం రవి బ్రసూర్ మ్యూజిక్ అని అందిస్తున్నాడు. దేవ్ నే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరి విలన్ గా మెప్పించిన దేవ్ హీరోగా ఈ మేర రాణిస్తాడో చూడాలి.