అగ్రిగోల్డ్ పై విచారణ.. మీడియాను నిరోధించాలన్న లాయర్లు.. నిరోధింలేమన్న హైకోర్టు

అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసు నేపథ్యంలో ఏర్పరిచిన రిటైర్డ్ జడ్జి సూర్యారావు కమిటీ కొన్నిరికమెండేషన్స్ చేసింది. దీనిలో భాగంగానే జనవరి 1 నుండి అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయాలని సూర్యారావు కమిటీ హైకోర్టును సూచించింది.  హైకోర్టు కూడా కమిటీ రికమెండేషన్స్ స్వీకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే బాధితుల ఆందోళనతో హైకోర్టు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో మీడియాను నిరోధించాలని అగ్రిగోల్ట్ తరపు లాయర్లు హైకోర్టును కోరడం జరిగింది. కానీ హైకోర్టు మాత్రం మీడియాను నిరోధించలేమని తేల్చి చెప్పింది. కాగా దీనిపై విచారణను మధ్యాహ్నం 2.15 నిమిషాలకు వాయిదా వేశారు.

మరోవైపు ఈ విషయంపై కారెం శివాజీ అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందుతులను అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు ఎందుకు నోరు విప్పడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బీనామీలను మేమే బయటపెడతామని హెచ్చరించారు. 46 లక్షల మంది బాధితులు రోడ్డున పడ్డారని.. వారిని వెంటనే ఆదుకోవాలని.. వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu