అఘోరీ మళ్లీ తెలంగాణలో  

గత నెలలో సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం కావడంతో తెలుగు ప్రజలకు పరిచయమైన అఘోరీ ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడంతో తెలంగాణ పోలీసులు  మహరాష్ట్ర బార్డర్ లో వదిలేశారు. కాశీకి వెళుతుంది అని అందరూ ఊహించారు. కానీ ఆమె ఎపిలో ఎంటర్ అయ్యారు. విశాఖపట్నంలోని శైవశ్రేత్రాలను దర్శించుకున్న అఘోరీ శ్రీకాకుళం శైవక్షేత్రం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మర్పణం చేసుకునే ప్రయత్నం చేసి సంచలనమయ్యారు. అక్కడ్నుంచి    శ్రీ శైలం శైవక్షేత్రాన్ని దర్శించుకున్న అఘోరీ  ఈ నెల 11న ( సోమవారం)విజయవాడ కనకదుర్గను దర్శించుకున్నారు. ఎర్రని వస్త్రాలతో ఆమె అమ్మవారిని దర్శించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పర్యటన పూర్తి అయ్యింది. ఈ నెల 12న  అంటే మంగళవారం ఆమె తెలంగాణ పోచమ్మ దేవాలయానికి వచ్చి అక్కడ్నుంచి కుంభమేళాకు వెళతానని అఘోరీ  ముందే ప్రకటించారు.తెలంగాణలో మళ్లీ ప్రవేశిస్తుందని తెలియడంతో పోలీసులకు టెన్షన్ పెరిగింది.