అమీర్ ఖాన్ కు పాకిస్థాన్ టికెట్లు బుక్..
posted on Nov 27, 2015 11:27AM
.jpg)
అమీర్ అసహనం పై గోల రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒకపక్క అమీర్ ఖాన్ పై విమర్శలు చేసేవాళ్లు చేస్తుంటే.. మరోపక్క ఆయనకు సపోర్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అమీర్ ఖాన్ కు ఏకంగా పాకిస్థాన్ కు రెండు టికెట్లు బుక్ చేసి మరీ దానిని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఒక జర్నలిస్టు అమీర్ ఖాన్ కుటుంబం పాకిస్థాన్ కు వెళ్లేందుకు వీలుగా మూడు ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసినట్లుగా హిందూసేన ప్రకటించి వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
కాగా ఎప్పూడూ వివాదస్పద వ్యాఖ్యలు చేసే శివసేన కూడా అమీర్ వ్యాఖ్యలకు స్పందించింది. దీనిలో భాగంగానే అమీర్ ను చెంపదెబ్బ కొడితే లక్ష రూపాయలు ఇస్తానని.. ప్రతి చెంప దెబ్బకి ఒక లక్ష ఇస్తామని.. అంతేకాదు అతనిని దేశభక్తుడిగా కీర్తిస్తామంటూ వ్యాఖ్యాలు చేసింది. మరి అమీర్ ఖాన్ వ్యవహారం ఎక్కడివరకూ దారి తీస్తుందో చూడాలి.