10 రూపాయలు ఎర.. 7 లక్షలు చోరీ!
posted on Jul 16, 2014 5:54PM
మంగళవారం నాడు హైదరాబాద్‌లో మాజీ ఎంపీ డ్రైవర్‌కి పది రూపాయలు ఎరగా వేసి కారులోంచి విలువైన వస్తువులు, కొంత డబ్బు దొంగలు కొట్టేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్‌లోనే అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. హైదరాబాద్ అమీర్‌పేటలోని సత్యం థియేటర్ ప్రాంతంలో వున్న హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు నుంచి సత్యారాం అనే వ్యక్తి తాను పనిచేసే సంస్థ కోసం ఏడు లక్షల రూపాయలు విత్ డ్రా చేశాడు. సత్యారాంని ఫాలో అవుతున్న దొంగలు అతని ముందు ఒక పది రూపాయల నోటు విసిరారు. పరాయి పది రూపాయలను చూసిన మోజులో సత్యారాం ఆ పదిరూపాయల నోటుని అందుకోవడానికి కిందకి వంగాడు. అంతే, అతని చేతిలో ఏడు లక్షల రూపాయలతో వున్న బ్యాగ్‌ని లాక్కుని దొంగలు పరారైపోయారు. సత్యారాం లబోదిబో అంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.