వరదలు.. 32 మంది మృతి

 

మొరాకో దేశంలోని వివిధ ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో ఇప్పటి వరకు 32 మంది మరణించారు. ఆరుగురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ హోంశాఖ మంత్రి మొరాకో రాజధాని రాబత్‌లో వెల్లడించారు. వీరంతా మొరాకో దక్షిణ ప్రాంతలోని అల్జీరియా సరిహద్దులో వున్న గ్లుమిమ్ నగర వాసులు. వరదల ఉద్ధృతి ఇంకా తగ్గకపోవడంతో నదులు, కాలువల పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలు, వరదల తాకిడికి దేశంలోని చాలా నగరాల మధ్య రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సోమవారం ఉదయం వరదల్లో చిక్కుకున్న 14 మంది ప్రజలను భద్రత సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో రక్షించారు.