లారీ డ్రైవర్ గా .. 24 ఏళ్ళ ఆమ్మాయి..  

వంటింటికే ఆడవాళ్లు అనేది ఒకప్పటి మాటలు.. నేటి సమాజం లో అన్ని రంగాల్లో మగాళ్ల తో పాటు మగువలు కూడా ఉండుంటున్నారు.. ఒక్కటేమిటి ఇందుగలడందులేటని సందేహం కలదు ఎందెందు చూసిన అందందే కలరు మహిళలు. హైదరాబాద్ లో పొట్టకూటి కోసం, పిల్లల చదువులకోసం ఆటో లను నడిపిన ఆడవాళ్ళని చూశాం. బస్సు డ్రైవర్స్ గా పనిచేసిన ఆడవాళ్లను కూడా చూశాం.. తాజాగా ఒక 24 ఏళ్ళ అమ్మాయి లారీ డ్రైవర్ గా పనిచేస్తుంది.. డ్రైవింగ్ చేయడం ఎంతో ఇష్టమైన పని అంటుంది. లారీ డ్రైవింగ్ మగాళ్లే కాదు, తానూ చేయగలనని నిరూపిస్తోంది ఆమె పేరు దెలిషా డేవిస్.. చదివింది ఎంకామ్. ఇప్పుడు లారీ డ్రైవింగ్ ను వృత్తిగా ఎంచుకుంది. 300 కిలోమీటర్ల పాటు అలుపు సొలుపు లేకుండా డ్రైవింగ్ చేస్తూ, వృత్తిని ఎంతో ఆస్వాదించడం ఆశ్చర్యం కలిగించే విషయం. తాము అనుకున్నది చేసే ఇప్పటితరం అమ్మాయిలకు అచ్చమైన ప్రతినిధిలా కనిపించే దెలిషాకు డ్రైవింగ్ అంటే ప్రాణం అని చెపుతుంది. ఆమె డ్రైవర్ వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏంటి..? ఎలాంటి ప్రరిస్థితులు ఆమెను డ్రైవెర్జ్ స్థిరపడేలా చేశాయో తెలుసుకుందాం.. 

ఆమె తండ్రి పీఏ డేవిస్ లారీ డ్రైవర్ కావడంతో, దెలిషా ఆ దిశగా ఆసక్తి పెంచుకుంది. డేవిస్ కూడా ఎంతో ధైర్యంతో తన కుమార్తెను డ్రైవింగ్ చేసేందుకు ప్రోత్సహించారు. దెలిషా వారానికి మూడు పర్యాయాలు ఓ పెట్రోల్ ట్యాంకరును కొచ్చి నుంచి మళప్పురం వరకు తీసుకెళ్లి మళ్లీ తిరిగొస్తుంది. ఇరుంబనం వద్ద ఉన్న ఆయిల్ రిఫైనరీ నుంచి చమురును తిరూర్ లోని ఓ పెట్రోల్ బంకుకు ట్యాంకరు ద్వారా తరలించడం ఆమెకు ఎంతో ఇష్టమైన పనిగా మారింది. గత మూడేళ్లుగా దెలిషా కేరళ రోడ్లపై తన ట్యాంకరు లారీని పరుగులు పెట్టిస్తోంది.

ఓసారి రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, దెలిషా లారీని కూడా ఆపారు. డ్రైవింగ్ సీట్లో అమ్మాయిని చూసి వారు షాక్ కేర్ గురయ్యారు. సార్, ఓ చిన్న అమ్మాయి ట్యాంకరు లారీ నడుపుతోంది అంటూ తమ పై అధికారులకు సమాచారం అందించారు. ఆపై, దెలిషా డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ వెహికిల్), ప్రమాదకర వస్తువులు రవాణా చేసే లైసెన్స్, ఇతర అనుమతి పత్రాలు చూసి మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అమ్మాయి అయినప్పటికీ నిబ్బరంగా లారీ నడుపుతున్న తీరు చూసి అధికారులు సైతం ఆమెను అభినందించారు. తొలుత టూ వీలర్ నడపడం నేర్చుకున్న దెలిషా, ఆపై ఫోర్ వీలర్ డ్రైవింగ్ ఆవాహనం చేసుకుంది శ్రద్దగా నేర్చేసుకుంది. ఈ క్రమంలో తన తండ్రి నడిపే పెట్రోల్ ట్యాంకరు డ్రైవింగ్ ను కూడా కొద్దికాలంలోనే వంటబట్టించుకుంది. 16 ఏళ్ల వయసులోనే దెలిషా లారీ నడిపిందంటే ఆమె నైపుణ్యం, తపన ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.

మల్టీయాక్సిల్ వోల్వో బస్సు నడపాలన్నది దెలిషా కల. అందుకు వీలుగా ప్రత్యేక లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. తండ్రి ప్రోత్సాహం వల్లే తాను లారీ డ్రైవర్ గా కొనసాగుతున్నానని, ఆయన వెన్నుతట్టకపోతే తాను డ్రైవింగ్ నేర్చుకుని ఉండేదాన్ని కాదని దెలిషా చెబుతోంది. తాను చదువును నిర్లక్ష్యం చేయలేదనీ, సాయంకాలం క్లాసులకు హాజరై ఎంకామ్ పరీక్షలు రాశానని, ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నానని చెబుతోంది దెలిషా. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.  

ఇదండీ మగాళ్లే కాదు మహిళలు కూడా తలుచుకుంటే ఏదైనా చేయగలరు.. అందుకని ఎప్పటి నుండి ఐన ఎవరైతే ఇంట్లో గానీ.. ఆఫీస్ లో గానీ మహిళలను చిన్న చూపు చూస్తూ సమాన గౌరవం ఎవ్వరో ఇప్పటి నుండి అయినా మహిళలను గౌరవించండి.. వాళ్ళు కూడా అన్ని పనులు చేస్తారని గుర్తించండి..మహిళా దినోత్సవం రోజు ఒక్క రోజే కాదు రోజు వాళ్ళను గౌరవించాడు.. మీరు గౌరవిచకపోయిన పర్లేదు గాడి చిన్నచూపు మాత్రం చూడకండి..