నాడీపతిలో వందకు పైగా చికిత్సలు!!
posted on Jun 16, 2022 9:30AM
సాంప్రదాయ వైద్యవిధానం లో మన పూర్వీకులు మనకుందించిన పురాతన వైద్యం లో ఒకటి నాడీ పతి.నాడీ పతిలో ఉన్న చికిత్సాపద్దతులలో సర్జరీలు,మందులు ఉండవని ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణమ రాజు అన్నారు.ఈమేరకు నాడీ పతిలో ఉన్న కొన్ని చికిత్సా పద్దతులు హానికరం కాదని ప్రాణాంతకం అంతకన్నాకాదని అన్నారు.ఈ చికిత్స పద్దతుల వివరాలు వాటివల్ల వచ్చే లాభాలు ఇందులో తెలుసుకుందాం.నాడీ పతిలో వందకు పైగా చికిత్సలు ఉన్నాయాని అన్నారు వాటిలో కొన్నిమీకోసం అందించే ప్రయత్నం చేస్తుంది తెలుగు వన్.
1)అక్యు పంక్చర్ తెరఫీ ...
అక్యు పంక్చర్ తెరఫీ భారతీయ సంప్రాదాయ వైద్యం లో భాగామే అని అన్నారు.భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా సూదుల ద్వారా చికిత్స చేసే వారని అన్నారు.శరీరంలో ప్రత్యేకంగా ఎంపిక చేసినా పాయింట్స్ లో స్టిములేషణ్ తెరఫీ ద్వారా శరీరానికి శక్తి నిచ్చి ఆరోగ్యాని అందిస్తామని తెలిపారు. నాడీ పతి వైద్య బృందం పరిసీలన లో అక్యు పంక్చర్ చికిత్స ద్వారా శరీరం లోపల ఉన్న సమస్యలకు భవిష్యత్తు లో మరే ఇతర జబ్బులబారిన పడకుండా నాడిపతి టెక్నిక్ తో శరీరంలో ఉన్న పంచేంద్రియాలను సమతుల్యం చేయవచ్చని నిరూపిత మైనదని డాక్టర్ కృష్ణం రాజు వివరించారు.అక్యుపంక్చర్ ను ఉపయోగించి రోగి ట్రీట్మెంట్ టేబుల్ పై ఉండగానే వారికి సంబందించిన నారాలసమస్యలు,శరీరంలో వచ్చే వివిదరకాల నొప్పులు సర్వైకల్ స్పొండోల సిస్,కిడ్నీ సమస్యలు,కంటి సమస్యలు,లివర్ సమస్యలు,మైగ్రైన్ సమస్యలు,ఒత్తిడి నిద్రలేమి,సంతాన లేమి సమస్యలు వంటి వాటికి చికిత్స చేయవచ్చు.
అక్యు పంక్చర్ వల్ల లాభాలు ...
ఆక్యుపంక్చర్ పద్దతిలో అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలకు సర్జరీ లేకుండానే చికిత్స చేయవచ్చని అనున్నారు.
అక్యుపక్చర్- అక్యు ప్రేషర్ మధ్య తేడా ఏమిటి?...
సాంప్రదాయ భారతీయ వైద్య విధానం లో భారతీయ వేదశాస్త్రం లో వైద్యం గురించి వివరించారని.అందులో మనశారీరము ప్రకృతి గురించి వివరించారని అన్నారు.శరీరం లో రెండు విభిన్న ద్రువాలు ఒకటి సూర్యుడు అయితే మరొకటి చంద్రుడని ఈరెండు క్రమపద్దతిలో ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యం గా ఉంటుందని.మనశరీరంలో మేరీడియన్స్ మాత్రమే శక్తి నిస్తాయని.శరీరమంత శక్తిని అందిస్తుందని శరీరంలో ఎప్పుదతే శక్తిఅన్డుంచకుండా నిలిచిపోవడం లేదా బ్లాక్ అయిపోవడం జరుగుతుందో అప్పుడు నొప్పి తీవ్రతర మౌతుందని అప్పుడు శక్తి అందక పోవడం వల్ల అనారోగ్యం పలౌతున్నారని డాక్టర్ కృష్ణమ రాజు వివరించారు.ఈ సమస్యకు శారీరకంగా ఒత్తిడి చేస్తామని దీనినే అక్యు ప్రెషర్ పాయింట్స్ యోక్క ఉద్దేశ్యం ఎక్కడైతే మేరిడి యన్స్ ప్రవాహం ఆగిందో బ్లాక్స్ ఉన్నాయోచేతులకు మణికట్టు వద్ద ఒత్తిడి చేయడం వల్ల లక్షణాలు చాలా సహజంగా తగ్గిపోతాయి.
అక్యు ప్రెషర్ వల్ల లాభాలు...
మా పరిశోధనా బృందం చేసిన పరిశీలనలో అక్యు ప్రెషర్ చికిత్స శరీరం బయట,లోపల చేయవచ్చని ఈ చికిత్స ద్వారా తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం సాధ్యమౌతుందని తెలిపారు.అలాగే మీ రు ఎదుర్కుంటున్న సెక్స్ సంబంధిత సమస్యలకు సైతం చికిత్స చేయవచ్చని అంటున్నారు కాగా డీ తోక్సిఫికేషన్ ముఖం పై మచ్చలు తొలగించవచ్చని నొప్పులు దీర్ఘ కాలిక వ్యాధులకు అక్యు ప్రెషర్ లాభదాయక మని పేర్కొన్నారు.
అక్యు టచ్ అంటే ఏమిటి...
అక్యు టచ్ లో పంచాబూతాలు పద్ధతి ని అనుసరించి తెరఫీ ని వృద్ది చేసినట్లు తెలిపారు.కాగా మెరిడియన్ పాయింట్స్ ను పంచభూతాలను సమతుల్యం చేయడం ద్వారారోగికి వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.ఇందులో చికిత్సలో భాగం గా శరీరంపై మీ ఇండెక్స్ ఫింగర్ ను మామూలుగా మీ చూపుడు వెళ్ళను కొన్ని ప్రాంతాలలో లేదా పాయింట్స్ లో ఎక్కడైతే మేరిడి యన్స్ బ్లోకేజేస్ ను పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తారు.ఆవిధంగా మెరిడియన్ లేదా పంచభూతాలను సమతుల్యం చేయడం ద్వారా ఆవిధంగా రోగికి చికిత్స చేసే వ్యాధిని తగ్గించే ప్రయత్నం చేస్తాము.దీనిని ఫైవ్ ఎలిమెంట్ ఫర్మ్లులా తెరఫీ ని వృధీ చేసినట్లు తెలిపారు.వీటి చికిత్స చేసేందుకు దాదాపు ౩ నుండి 5 నిమిషాలు పడుతుందని వివరించారు.