బాబు మీటింగ్ కి 10మంది ఎమ్మెల్యేల డుమ్మా... నలుగురిపై అనుమానాలు

వల్లభనేని వంశీ అండ్ దేవినేని అవినాష్ రాజీనామా... ఇసుక దీక్ష తర్వాత చంద్రబాబు నిర్వహించిన అత్యంత కీలక సమావేశానికి 10మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టడం... తెలుగుదేశంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అసలే, చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నవేళ అంతమంది ఎమ్మెల్యేలు కీలక సమావేశానికి డుమ్మాకొట్టడంతో పార్టీ లీడర్లతో పాటు బాబు సైతం కంగుతిన్నారట. అంతేకాదు సమావేశం గురించి ఒకరోజు ముందే సమాచారమిచ్చినా ఎందుకు రాలేదని చంద్రబాబు ఆయా ఎమ్మెల్యేలను ఫోన్లో ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ పది మందిలో కొందరు ముందే సమాచారమిచ్చినా, ఎక్కువమంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే డుమ్మాకొట్టారట. చంద్రబాబు సమావేశానికి డుమ్మాకొట్టిన ఎమ్మెల్యేల్లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బాలకృష్ణ, గద్దె రామ్మోహన్ రావు, చినరాజప్ప, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ లు.... వివిధ కారణాలను చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, గంటా శ్రీనివాసరావు, బెండాలం అశోక్, పీజీవీఆర్ నాయుడు, వాసుపల్లి గణేష్ లు... ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే సమావేశానికి గైర్హాజరయ్యారని అంటున్నారు. అయితే, ఈ నలుగురిలో గంటా ఎప్పట్నుంచో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండగా, మిగతా ముగ్గురుపైనా ఇఫ్పుడు అనుమానాలు మొదలైయ్యాయి. గంటాతోపాటు వీళ్లు కూడా జంపింగ్ బ్యాచ్ లో ఉన్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

అయితే, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని పావులు కదుపుతోన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి.... పార్టీ ఫిరాయింపులపై తాను చేసిన వ్యాఖ్యలే తనకు అడ్డంకి మారాయి. చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా.... రాజీనామాచేశాకే పార్టీలోకి రావాలన్న జగన్ కండీషన్ ... వాళ్లను వెనుకంజ వేయిస్తుందట. కానీ, చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ఆలోచిస్తున్న జగన్.... 8నుంచి 10మంది ఎమ్మెల్యేలను మాత్రం టీడీపీ నుంచి బయటికి రప్పించడానికి పావులు కదిపారని అంటున్నారు. మరి, బాబు కీలక మీటింగ్ కి డుమ్మాకొట్టిన ఈ 10మందిలో కనీసం నలుగురైదుగురు ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది.