నేపాల్‌లో ప్రమాదం.. హైదరాబాద్ బాలుడి మృతి

 

నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన బాలుడు మరణించినట్టు సమాచారం అందుతోంది. నేపాల్‌లోని పర్సా ప్రాంతంలో బుధవారం ఉదయం ఒక బస్సు, టెంపో వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపో డ్రైవర్ మరణించాడు. అలాగే టెంపోలో ప్రయాణిస్తున్న పద్దయ్య అనే హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి కుటుంబం గాయపడింది. ఈ ప్రమాదంలో పద్దయ్య ఎనిమిదేళ్ళ కుమారుడు చనిపోయినట్టు తెలుస్తోంది.