నేవిగేషన్ సేవల కోసం మరో రాకెట్
posted on May 29, 2023 3:19PM
జీఎస్ఎల్ వి రాకెట్ ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించింది. నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ మీద భారత్ పెద్ద ఆశలే పెట్టుకుంది.
జిఎస్ఎల్ వీ - ఎఫ్12 రాకెట్ ప్రయోగం విజయవంతం అవుతుందనీ భారత్ ముందే ఊహించింది.
ఇస్రో మరో రాకెట్‌ను ప్రయోగించించడాన్ని ప్రపంచమంతా వీక్షించింది.
సోమవారం నావిగేషన్ శాటిలైట్ ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది.
ఈ ఉపగ్రహాన్ని ఉదయం 10:42 గంటలకు నింగిలోకి తీసుకెళ్లింది.
ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్ వ్యవస్థ మరింత మెరుగుపడి తన సేవలను మరింత విస్తరించనుంది.
నావిగేషన్ సేవల కోసం గతంలో పంపిన వాటిలో నాలుగు ఉపగ్రహాల జీవిత కాలం ముగిసింది. వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ సోమనాథ్ శనివారమే వెల్లడించారు. ప్రాంతీయ నావిగేషన్ సిస్టమ్ భారతదేశానికి ఎందుకు ముఖ్యమైనది అనేది ఈ రాకెట్ శోధిస్తుంది. ప్రస్తుతం ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కాన్స్టెలేషన్‌లో ఉన్న ఏడు ఉపగ్రహాలలో ప్రతి ఒక్కటి లిఫ్ట్‌ఆఫ్ వద్ద చాలా తక్కువ - దాదాపు 1,425 కిలోల బరువు కలిగి ఉంది. దీని పొడవు 49.11 మీటర్లు. 2001 నుంచి ఇస్రో ప్రయోగించిన రాకెట్లలో ఇది 15వది.