మోడీ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా..?

 

నరేంద్ర మోడీ ప్రధాని అయిన దగ్గర నుండి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. నల్లధనాన్ని అరికట్టేందుకు గాను పెద్ద నోట్లను రద్దు చేసి నల్ల కుబేరుల గుండెల్లో దడ పుట్టించారు. మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మొదట వ్యతిరేకించినా ఆతరువాత మాత్రం మోడీ సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇక ఆతరువాత తీసుకున్న అతిపెద్ద నిర్ణయం జీఎస్టీ. ఒకే దేశం.. ఒకే పన్ను విధానం ఉండాలన్న నేపథ్యంలో జీఎస్టీ బిల్లును తీసుకొచ్చారు. మొదట ఈబిల్లుకు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఆ తరువాత అందరి మద్దతుతో ఇటీవలే ఈ బిల్లు అమల్లోకి వచ్చింది. ఇక ఇప్పుడు మోడీ నెక్ట్స్ టార్గెట్ ఏంటని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తుండగా ఇప్పుడు మరో కీలక అంశంపై ఆయన దృష్టిని సారించినట్టు సమాచారం. అదేంటంటే..రాజకీయ విరాళాల వ్యవస్థ ప్రక్షాళన. రాజకీయ విరాళాలను ప్రక్షాళన చేయడమే ఇప్పుడు అత్యంత ప్రధానమైన అంశమని... ఇకపై రాజకీయ పార్టీలు విరాళాలను నగదు రూపంలో కాకుండా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. దీంతో తాజాగా మోదీ దృష్టి సారించిన అంశంతో రాజకీయ పార్టీలలో వణుకు మొదలైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu