హిందూ పూజరి దారుణ హత్య..

 

బంగ్లాదేశ్ లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. హిందూ పూజారి ఒకరు ఈ రోజు దారుణ హత్యకు గురయ్యారు. జినాయ్ గర్ జిల్లాలో ఆలయానికి వెళుతున్న 64 ఏళ్ల  అనంత గోపాల గంగూలీ అనే పూజారిని బైక్ పై వచ్చిన ముగ్గురు అగంతకులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ లో ఇటీవలి కాలంలో మైనారిటీ హిందువులపై దాడులు పెచ్చరిల్లిన సంగతి తెలిసిందే.