మీడియాకు నిజాయితీ లేదు.. నిప్పులు చెరిగిన ట్రంప్
posted on Jun 1, 2016 12:48PM
.jpg)
అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అయితే ఈసారి ఆయన మీడియాను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అందుకే మీడియాపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. న్యూయార్క్ లో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయనను.. తాను సేకరించిన 6 మిలియన్ డాలర్ల నిధులపై ప్రశ్నించారు. అంతే ఇక కోపం కట్టలు తెంచుకొచ్చిన ట్రంప్ మీడియాపై నిప్పులు చెరిగారు. మీడియాకు నిజాయితీ లేదని.. పత్రికల్లో, టీవీల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని విమర్శించారు. అవన్నీ అసత్యాలని ప్రజలకు తెలుసన్నారు. అంతేకాదు ఏబీసీ న్యూస్ జర్నలిస్ట్ టామ్ లలామస్‌పై కూడా మండిపడ్డారు. అతనిది అనైతిక ప్రవర్తన అని.. అతడికి నిజానిజాలు బాగా తెలుసని ట్రంప్ మండిపడ్డారు. కాగా ఛారిటీల కోసం జనవరిలో ట్రంప్ నిధుల సేకరణ కార్యక్రమానికి విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే.