ఢిల్లీ గ్యాంగ్ రేప్: జైల్లో రాంసింగ్‌ మృతి

 

 

Delhi gang rape case, Delhi Gang rape accused Ram Singh, Ram Singh died

 

 

ఢిల్లీ లో వైద్య విద్యార్ధిని 'నిర్భయ' పై సాముహిక అత్యాచారం కేసులో నిందితుడు రా౦సింగ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యాచారం కేసులో పట్టుబడిన ఆరుగురు నిందితుల్లో ఒకడైన రాంసింగ్‌ వయస్సు 33 ఈరోజు తెల్లవారు జామున 5 గంటలకు జైల్లో ఉరి వేసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇతడి మృతిని తీహార్‌ జైలు అధికారులు ధ్రువీకరించారు. జైల్‌లో గది నంబర్‌ మూడులో కిటికీ గ్రిల్‌కు రాంసింగ్‌ ఉరి వేసుకున్నట్లు వారు తెలిపారు. అధికారులు అతని మృతదేహాన్ని ఢిల్లీలోని దీన దయాళ్‌ ఆస్పత్రికి తరలించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu