నయనతార పెళ్ళి పై వార్తలు
posted on Mar 26, 2013 5:04PM

నయనతార మళ్ళీ వార్తల్లోకెక్కింది. ప్రభుదేవాతో ప్రేమపెళ్లి దాక వచ్చి తెగదెంపులు చేసుకున్నాక..తన సినీ కేరియార్ పైన దృష్టి పెట్టింది. తాజాగా నయనతార పెళ్ళి పై వార్తలు జోరందుకున్నాయి. ఆ మధ్య తమిళ నటుడు ఆర్య గృహప్రవేశానికి వచ్చిన నయనతార, అతనిని త్వరలో పెళ్ళి చేసుకోబోతుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ పెళ్ళి వార్తలపై నటుడు ఆర్య స్పందించారు.
“అందరు హీరోయిన్ల లాగే నయనతార కూడా తనకు మంచి స్నేహితురాలని, ఆమెను నేను పెళ్లి చేసుకుంటానని వార్తలు వస్తున్నాయి అయితే ఆమె నా మంచి చెడ్డలు పట్టించుకునే స్నేహితురాలు మాత్రమే. భవిష్యత్ ఏమిటో చెప్పలేను గాని ఆమె నాకు ప్రస్తుతానికి ఆత్మీయురాలు” అని ఆర్య అన్నారు. మరి వీటిపై నయన ఎలా స్పందిస్తుందో చూడాలి.