Previous Page Next Page 
యోధుడు పేజి 3

    "అవును."

    "యూజివల్ గా అతను ఎడంచేత్తో రాస్తాడా?" అడిగాడు ప్రణవమూర్తి.

    "తెలీదు" చెప్పాడు ప్రొపెసర్ విశ్వంభర్.

    "ఇంతకీ TSYఅంటే ఏమిటి?" ప్రశ్నించాడు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు.

    "అతను చెప్పాల్సిన ఏదో పేరులోని ఇనీషియల్ లెటర్స్ ని రాశాడేమో?" అన్నాడు ప్రణవమూర్తి.

    "ఆ మూడు అక్షరాలూ TSYఅనే ఇంగ్లీషు అక్షరాలే కదా? అందులో మార్పేమీ లేదు కదా?"

    "నో డౌంట్. మూడుక్షరాలు TSY అక్షరాలే" మరో పడి నిమిషాల సేపు అక్కడే అ అక్షరాలా గురించి చర్చ జరిగింది.

    ఆ తర్వాత మళ్ళీ కలుస్తామని చెప్పి ప్రణవమూర్తి లాబరీటరీలోంచి బయటపడ్డారు. ముగ్గురూ.

    "బస్సులో కాశీచరణ్ పక్కన కూర్చున్న క్రిమినల్ పేరుకి సంభందించిన కోడ్ అయి వుంటుందేమో. ఈ TSY" కారేక్కుతూ అన్నారు డి.సి.పి.

    "మిష్టర్ డి.సి.పి మీరేం చేస్తారో. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారో నాకనవసరం, వారం రోజులు టైంమాత్రం వుంది. ఈ క్లూ ద్వారా నేరస్థుడ్ని పట్టుకోకలిగితే అతి కీలకమైన రహస్యాన్ని మనం భేదించిన వాళ్ళమవుతాం. లేకపోతే ఆ క్రిమినల్ చేతిలో మీరూ, నేనూ, కాశీచరణ్ ముగ్గురం బలైపోతాం" చాలా సీరియస్గా అన్నాడు నీలకంఠన్.

     నీలకంఠన్ మనస్సులో ఆవేదన, ఆత్రుత ఒక్క డి.సి.పి కి మాత్రమె తెలుసు.

    "అంత సీరియస్ కేసా?" అడిగాడు ప్రొపెసర్.

    "అవును ప్రొపెసర్!" అన్నాడు  నీలకంఠన్.

    ఆ మొగ్గురూ ఎక్కినా కారు అరగంట తర్వాత నగర శివార్లలోని  నీలకంఠన్ విశాలమైన బంగ్లా ముందు ఆగింది. అప్పుడు రాత్రి గంటల ఇరవై అయిదు నిమిషాలైంది.
   
                         అసలు కధ ప్రారంభం   
   
    సరిగ్గా పై సంఘటన జరిగిన నాటికీ__ తొంభై ఆరు రోజుల క్రితం_ అర్ధరాత్రి 1.20నిమిషాలు...

    వరంగల్ హైవేపై బీబీనగర్ స్టేషన్ దాటి హైదరాబాద్ కేసి డెబ్భై కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకుపోతుంది తెల్లటి మారుతీ వ్యాన్.

    దాని వెనుక కాస్త దూరంలో అదే వేగంతో వెళుతోంది తెల్లటి ఫియట్ కారు.

    బీబీ నగర్ దాటినకొద్ది నిమిషాలకే షరావేగంతో దూసుకువెళుతున్న ఆ మారుతీ వ్యాన్ ఎదురుగా వున్న రైలుగెట్ పడిపోవటంతో సదన్గా రోడ్డు పక్కన ఆగింది.

    వ్యాన్ ఆగీ, ఆగడంతోనే చప్పుడు చేస్తూ డోర్ తెరుచుకోవడం, వ్యాన్ లోంచి తెల్లని వస్తువును రోడ్డు పక్కనున్న పొదల్లోకి విసరడం వెనకాల వస్తున్న  ఫియేట్ కారు డ్రైవింగ్ సెట్లో వున్న యువకుడికి అస్పష్టంగా కనిపించింది. అతను ఆశ్చర్యపోయి చూస్తుండగానే మరుతీవ్యాన్ రాకెట్ వేగంతో రివర్స్ అయి తిరిగి బీబీనగర్ వైపు  దూసుకుపోసాగింది.

    వాళ్ళు వ్యాను ని సడన్ గా ఎందుకు అపారో?

    అసలు వాళ్ళు ఎవరు?

    వ్యాన్ లోంచి ఎ వస్తువును రోడ్డు పక్కనున్న పొదల్లోకి విసిరారో తెలియని ఆ యువకుడు కారుని ఆ పోడ దగ్గరకి తీసుకెళ్ళి ఆపాడు. ఫియేట్ కారు హెడ్ లైట్స్ వెలుగులో దూరం నుంచి మొదట్లో తెల్లగా కనిపించిన  ఆవస్తువు, రానురానూ ఎరుపు రంగులో కనబడంతో, ఆ ఎరుపు రంగును రక్తం మరకలుగా గుర్తించిన యువకుడు షాక్ తిన్నాడు.

    "కారెందుకు అపావ్?" స్టీరింగ్ ముందు కూర్చున్న యువకుడ్ని పక్కనున్న కుర్రాడు మగత నిద్రలోంచి  అకస్మాత్తుగా తెప్పరిల్లిఅడిగాడు.

    వెనుకనున్న కుర్రాళ్ళు కూడా కళ్ళు విప్పారు.

    "ఒరేయ్ నిద్రమోహవోడా! ఒక్కసారి కల్లిప్పి ఆ రోడ్డు సైడుకి చూడు" అన్నాడు మొదటి యువకుడు.

    ఎర్రటి వస్తువు వైపు చూసిన ఆ కుర్రాడు భయంతో కేవ్వుమంటూ పెద్దగా కేకవేశాడు.

    అప్పటికే రోడ్డుపక్క పొదల దగ్గర పడున్నది వస్తువు కాదని, రక్తపు గాయాలతో విలవిలా  కొట్టుకుంటున్న వ్యక్తి అని గ్రహించిన మొదటి యువకుడు వెంటనే కారు దిగాడు. అతనితోపాటు మిగతా ముగ్గురు ప్రెండ్స్ కూడా కారు దిగారు.

    కారులోంచి ముందుగా దిగిన ఆ యువకుడు వేగంగా గాయపడిన వ్యక్తి దగ్గరవెళ్ళి పోదల్ని పక్కకి తప్పించి నాడి చూశాడు.

    "కమాన్ ప్రెండ్స్! ఇదేదో యాక్సిడెంట్ కేసైనా అయివుండాలి_ లేదా ఎవరో ఇతడ్ని బాగా కొట్టి చనిపోయాడనుకుని పడేసి వుమ్దవాచు. ఇతను కోన ఊపిరితో కొట్టుకుంటున్నాడు."

    "ఇప్పుదెం చేద్దాం?" ప్రక్కనున్న యువకుడు అడిగాడు కంగారు పడిపోతూ.

    "ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇద్దామా?" ఇంకో కుర్రాడు అన్నాడుభయంగా.

    "మనం ప్రజాసేవ చేయాలనుకుంటే, ఇది మెడికో లీగల్ కేసుగా మారిపోతే? అప్పుడు రూల్స్ ప్రకారం ఉస్మానియాకు చేర్చాలి. కానీ అంత వరకూ ఇతని ప్రాణాలు నిలుస్తాయన్న గ్యారంటీ లేదు" అన్నాడు మరో యువకుడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS