Previous Page Next Page 
యోధుడు పేజి 2

    సరిగ్గా ఎనిమిదీ నిమిషాల తర్వాత ప్రొపెసర్ విశ్వంభర్ చాంబర్లో కాశీచరణ్ ప్యాడ్ మీద పేపర్లో రాసిన అక్షరాల విశేషణ కార్యక్రమం మొదలైంది.

    "ఇది కాశీచరణ్ సంతకమావు, పిచ్చిగీతలో, గొలుసు కట్టు ఇంగ్లీషు రాతలో లేక మనకు అందించిన మేసేజో ఏదో అర్ధంకావడంలేదు" చాలాసేపు పరిశీలించిన మీదుట డి సి.పి అన్నాడు.

    "ఇది సంతకం కాదు. అతని సంతకాన్ని నేను గుర్తుపట్టగాలను" నమ్మకంగా చెప్పాడు నీలకంఠన్.

    "యూ ఆర్ కరెక్ట్ మిష్టర్ నీలకంఠన్! కనీసం ఇవి ఇంగ్లీషు అక్షరాలూ కూడా కాదని నా నమ్మకం" అన్నాడు ప్రొపెసర్ విశ్వంభర్.

    "అయితే ఉత్తగీతలేనంటారా?" మళ్ళీ ప్రశ్నించాడు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు. కాసేపు దీర్ఘాలోచనలో పడ్డాడు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు. కాసేపు దీర్ఘాలోచనలో పడ్డాడు ప్రొపెసర్ విశ్వంభర్.

    ఆ సమయంలోనే డోర్ తెరుచుకుని లోనకొచ్చిన మరో డాక్టర్ కాశీచరణ్ స్పృహాలోకొచ్చిన సమయంలో కంప్యూటర్లో వచ్చిన అతని మానసికంగా పరిష్టితికి సంబంధించిన రిపోర్టును ప్రొపెసర్ విశ్వంభర్ కు అందించి వెళ్ళిపోయాడు.

    అ రిపోర్ట్ ను పరీశీలించాక, ప్రొపెసర్ విశ్వంభర్ చెప్పసాగాడు_ "కాశీచరణ్ కేవలం పదిహేడు సెకండ్లు మాత్రమె స్పృహలో వున్నాడు. అ సమయంలో అతని రక్తప్రసరణ మామూలు మనిషి రక్తప్రసరణకంటె అయిదు శాతం ఎక్కువ జరిగింది. ఆ కారణంగా, ఆ సమయంలో అతని దేహంలో చాలా అనూహ్యమైన మార్పులు వేగంగా జరిగి పోయాయి. హృదయంలోంచి రక్తప్రసరణ కుడిచేతిలోకి జరిగినంత వేగంగా మెదడుకి జరగలేదు. సో__ అ కారణంగానే అతని చూపులు ఒకేచోటే స్థిరంగా వుండిపోయాయి."

    "అంటే_ ఆ పేపర్ మీద అతను రాసినది బ్రెయిన్ తో సంభంధం లేకుండా రాసిందా?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నీలకంఠన్.

    "ఏస్.... పదిహేడు సెకండ్లు మాత్రమే మేలుకువుగా వున్న కాశీచరణ్ పెన్ను పట్టుకున్న సమయంలో మాత్రమె స్ప్రుహాలో వుంది వుంటాడు" చెప్పాడు ప్రొపెసర్ విశ్వంభర్.

    "అతనికి పూర్తీస్పృహా వచ్చేవరకూ వెయిట్ చెయ్యాల్సిందేనా?"

    "అక్కర్లేదు, మిస్టర్ నీలకంఠన్! కాశీచరణ్ రాసింది పిచ్చిగీతలో లేక ఏవైనా అక్షరాలో తెలుసుకోవడానికి అవకాశం వుంది" చెప్పాడు. డి .సి.పి.

    "ఎలా? ఫోరెన్సిక్ ఎక్స్ ఫర్ట్ కి పంపుతారా?"

    "కాదు. రైటింగ్  ఎక్స్ ఫర్ట్ కి పంపుతాం. హేండ్ రైటింగ్  ఎనలైజర్ మాత్రమె ఈ రైటింగ్ ని ఎనలైజ్ చేయగలడు" మళ్ళీ చెప్పాడు డి.సి.పి.

    "యూ మీన్.... గ్రాఫాలజీ" ప్రొపెసర్ అన్నాడు.

    "ఏస్... ప్రొపెసర్! నాకు తెలిసిన గ్రాఫాలజీ స్పెషలిస్ట్ ఒకాయన వున్నాడు. ఫోన్ చేయ మంటారా?" అడిగాడు డి.సి.పి.

    "ఓ.కే.క్యారీ అన్" అంటూ తంగీకారం  వ్యక్తం చేశాడు ప్రొపెసర్ విశ్వంభర్.
   
                                                          *    *    *    *
    అదే రోజు__ రాత్రి 7_45నిమిషాలు .

    మోహదీపట్నం సిటీబస్ తెర్మనల్ కి యాభై గజాల దూరంలో రోడ్డుకి ఎడం పక్కనున్న రెండంతస్టుల బిల్డింగ్ లో ఫస్ట్ ప్లోర్లోని లాబరేటరీలో గ్రాఫాలజిస్ట్ ప్రణవమూర్తి, తన కెదురుగా కూర్చున్న ముగ్గురు వ్యక్తుల వైపు చూసి_ ప్రొపెసర్ విశ్వంభర్ అందించిన పేపర్ని మైక్రోస్కోపుతో పరిశీలించసాగాడు.

    ప్రణవమూర్తికి దాదాపు నలభై అయిదేళ్లుంటాయి. బట్టతలా, చిన్న పిల్లి గెడ్డం దూరం నుంచి చూస్తె లెనిన్ లా వుంటాడు.

    దేశం మొత్తం మీద గ్రాఫలజీలో ప్రసిద్దులైన అతి కొద్దిమందిలో అతనొకడు.

    "ప్రొపెసర్ విశ్వంభంర్! నా సందేహాల్ని మీరు కొన్ని క్లీయర్ చేస్తారా?" అడిగాడు ప్రణవమూర్తి.

    "అడగండి మిష్టర్ మూర్తీ!"

    "ఈ పేపర్ మీద ఈ రాతల్ని రాసినవ్యక్తి రాస్తున్న సమయంలో స్ప్రుహాలో వున్నాడా?"

    "ఉండొచ్చు.... ఉండకపోవచ్చు. డిటైల్డ్ ఎనలైజేషన్ నాకింకా రాలేదు" చెప్పాడు విశ్వంభర్

    "ఈ రాతల్ని రాసిన వ్యక్తి పూర్తిగా స్పృహలో లేడు. అలాగే అతని వెళ్ళ కండరాలు అతని స్వాధీనంలో లేవు" ఇంకా ఏదో చెప్పాబోయిన ప్రణవమూర్తి మాటలకు అడ్డోచ్చాడు నీలకంఠన్.

    "ఇంతకీ అందులో ఏం రాసుంది?" అంటూ.

    "TSYఅనే అక్షరాలు" చెప్పాడు ప్రణవమూర్తి.

    "అంత పెద్ద పొడవాటి వాక్యంలో వున్నవి ఆ మూడు అక్షరాలేనా?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు డి.సి.పి.

    "ఆ మూడక్షరాల్ని రాస్తున్నప్పుడు మాత్రమె ఆ వ్యక్తి స్ప్రుహాలో వున్నాడు. ఆ వేణు వెంటనే అతనికి స్పృహా పోయింది. అందుచేత మిగతదంతా వంకర టింకర గీతాలు అ మూడక్షరాలు కూడా గొలుసుకట్టులో రాయడంవల్ల ఆ గీతాల్నీ కూడా మనం అక్షరాలుగా భ్రమించడానికి అవకాశం వుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం_అతనీ అక్షరాల్ని కుడిచేతితోనే రాశాడా?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS