Previous Page Next Page 
జాగృతి పేజి 3

 

    "అయ్యో! ఉండు నాయనా ఏదన్నా తిందువు గాని. రాత్రిళ్ళు అన్నం తినను. ఫలహారం చేస్తా. ఉండు దోసెల పిండి ఉంది. రెండు దోసెలు వేస్తాను. తిందువు గాని." లేస్తూ అంది.
    "వద్దమ్మా, రెండరీటిపళ్ళు ఇంత మజ్జిగ ఇయ్యి చాలు " మొహమాటంగా అన్నాడు.
    "అయ్యో తిండి తినే వయసు నీది. అర్ధాకలితో ఎలా పడుకుంటావు. ఎంతసేపు డోస్ వేయడం? "ఫ్రిజ్ తెరిచి గిన్నె తీసి పట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది. వేడివేడిగా రెండు దోసెలు వేసి పచ్చడి వేసి డైనింగ్ టేబిల్ మీద పెట్టి , ర బాబూ! వచ్చి తిను' అది రెండరటిపళ్ళు, మజ్జిగ కూడా పెట్టింది. శ్రీనూ తింటున్నంత సేపు ఆమెనే గమనించాడు. ఈవిడ ఈ వయసులోనే ఇంత పచ్చగా ఉందంటే వయసులో ఎంతందంగా ఉండేదో. పండిన తమలపాకులా, నెరిసిన జుత్తులో కూడా ఎంతందంగా , హుందాగా ఉంది. గోప్పింటావిడ అని చూడగానే తెలిసిపోతుందిఅనుకున్నాడు. చేతులకి నాలుగేసి మెరిసే బంగారు గాజులు, చెవులకి రవ్వల దుద్దులు,  మేడలో సన్నని చెయిను, తెల్లచీర, జాకట్లతో ఎంత దర్జాగా ఉంది. డెభై ఏళ్ళు ఉంటాయేమో అనుకున్నాడు.
    "మీరు ఒక్కరేనా ఉండేది, పిల్లలు ఎవరూ లేరా?" అడిగాడు.
    "పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు బాబూ. ఇద్దరూ ఇంజనీర్లే పెళ్ళిళ్ళయి అక్కడే ఉన్నారు.
    "వంటరిగా ఒక్కరూ ఉన్నారు. మీరు అమెరికా పిల్లల దగ్గిర కెళ్ళి పోకూడదామ్మా"
    "కిందటేడే అయన పోయారు బాబూ, ఆప్పటివరకు పక్క వీధిలో ఉన్నాం. అయన పోయాక పిల్లలు అమెరికా వచ్చేయమని బలవంత పెట్టారు. అక్కడ నాకేం తోస్తుంది నాయనా. అంతా ఉద్యోగాలకి పోతారు. అంతేకాక ఆ చలి నాకు పడదు బాబూ నే రానంటే ఒక్కర్తితని ఉండద్దు అని ఈ ప్లాట్ కొని, దీన్లో అయితే చుట్టూ జనం, గేటు ముందు కాపలా ఉంటుంది. పిలిస్తే పలికే ఇరుగుపొరుగు ఉంటారని ఇక్కడ ఏర్పాటు చేసి వెళ్లారు."
    "ఇంట్లో తోడుకి ఎవరన్నా పనమ్మాయిని పెట్టుకోవాల్సిందమ్మా!"
    "ఇంకా కాలు చేయి ఆడుతుంది గద బాబూ, పనిపిల్ల ఉదయం నించి ఉండి అన్ని పనులు చేసి పెడుతుంది."
    "అయినా కాలక్షేపానికి."
    "కాలక్షేపానికేం కొదవ. టి.వి. ఉంది. పుస్తకాలున్నాయి. ఇరుగుపొరుగు ఆడవాళ్ళు వచ్చి పోతుంటారు. శనివారం రామకృష్ణమఠంకి వెడతాను. ఆదివారం జిడ్డు కృష్ణమూర్తి సెంటర్ కి వెడతాను. శుక్రవారం లలిత సహస్త్రనామార్చనకి వెడతాను. అవతలి వీధిలో మా అక్క పిల్లలున్నారు. మలక్ పేటలో తమ్ముడున్నాడు. కారు డ్రైవర్ రమ్మన్నపుడల్లా వస్తాడు దేనికి లోటు లేకుండా హాయిగా ఉన్నాను బాబూ. హాయిగా ప్రశాంతంగా చదువుకుంటూ ఉంటాను " అంది.
    "మీ అమ్మా, నాన్న, తోబుట్టువులు అందరో ఉన్నారా నీకు. వంటరిగా ఇక్కడెందుకు ఉంటున్నావు-"
    శ్రీను తినడం పూర్తి చేసి చెయ్యి కడుక్కున్నాడు. ఆమె ప్రశ్నలకు ఒక్షణం అతని ముఖంలో విషాద చాయలు అలుముకుంది. "అమ్మ, నాన్న, అక్క , తమ్ముడు అందరూ ఉన్నారు. కాని వాళ్లకి నేను లేనమ్మా. నన్నందరూ వదిలేశారు." అదోలా నవ్వి అన్నాడు.
    లలితమ్మ అర్ధం కానట్టు చూసింది ." ఈ ఊళ్లోనే ఉంటారా అంతా, మీ నాన్నేం చేస్తారు?"
    "లేదు మాది వికారాబాద్ దగ్గిర పాతూరు గ్రామం. మా నాన్న రైతు . ఐదెకరాల పొలం, బియ్య, కూరగాయలు పండిస్తారు మా అయ్యి.
    "నీవేం చదువుకోలేదా బాబూ-" వివరాలు అరా తీయడం ఆరంభించింది.
    "ఎందుకు చదవలేదు. బి.కాం చదివా , కడుపు కట్టుకుని చదివించాడు అయ్య, రెండేకరాల పొలం అమ్మి డిగ్రీ చదివించాడు. ఈ చదువు నాకేం ఇచ్చింది. మా అయ్యకి అప్పులు మిగిల్చింది. మూడేళ్ళు ఉద్యోగం దొరక్క ఇంట్లో అయ్య, అమ్మ కూలి పన్లకి పోతుంటే తిని కూర్చోలేక చచ్చిపోదామనుకున్నా. పొలం పోతానంటే ఇంత చదువు చదివింది మట్టి పనికా కొడకా అనేది అమ్మా......."
    "ఉద్యోగం దొరక్కపోతే ఏదన్నా చిన్న వ్యాపారం ......"
    "యాపారం , అంత మాకాడ పైసలుంటే ఈ తిప్పలేంది అమ్మా. మా మల్లేశ్ నన్ను అన్నకి పరిచయం చేయకపోతే ఈపాటికి చెర్లో దూకి చచ్చేవాడిని."
    "మల్లేశ్ ఎవరు?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS