Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12
"ఎందుకైనా మంచిది ఆత్మరక్షణ కేదైనా తీసుకు వెళ్ళరూ?" అంది ఆరుణ.
దక్షిణామూర్తి ఒక్క క్షణం అలోచించి - "నీ తమ్ముడి కోసం మనం కొన్న టాయ్ పిస్టలుంది కదా" అదిలాగివ్వు ...." అన్నాడు.
ఆమె పెట్టి తెరచి టాయ్ పిస్టల్ తీసి అతడికిచ్చింది.
దక్షిణామూర్తి పిస్టల్ జేబులో వేసుకొని గదిలోంచి బయట పడ్డాడు. అరుణ తలుపు వేసుకుంది.
12
"ఎవరూ?" అన్న కోమల స్వరం మున్ముందు వినిపించింది. ఆ వెనుకనే తలుపులు తెరచుకున్నాయి.
"నా పేరు దక్షిణామూర్తి. మీ శ్రేయోభిలషిని అర్జంటుగా మీతో మాట్లాడాలి -" అన్నాడతను.
ఆమె పక్కకు తొలగి చోటిచ్చింది.
అతడు తలుపులు వేశాడు.
"రండి కూర్చోండి -" అందామె మృదువుగా.
"మీరు చాలా అందంగా వున్నారు. ఇంత అందమైన భార్య ఉండగా చెంగల్రావు గారి కదెం బుద్దో?" అన్నాడతడు.
"ఏం జరిగింది ?"
"అతడు చెప్పాడు.
"నేను నమ్మను...." అందామె.
"ఎందుకని?"
"వారికి స్త్రీలంటే గౌరవం...."
"నా భార్య నా గురించి అలాగే అనుకుంటుంది.
"మీ భార్య ఎక్కడుంది ?"
"పక్క గదిలో...."
"అయితే నాకోసారి పరిచయం చేయండి. తప్పమేదే అయుంటుందని నా నమ్మాకం. మావారిని చూసి ఎందరో ఆడవాళ్ళు వెంటబడుతుంటారు. - ఆయన్నాకర్షించి డబ్బు సంపాదించాలని...." అందామె.
'ఆ సంగతి తర్వాత ....ముందు నేను వచ్చిన పని చెబుతాను, నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చాను" అన్నాడతడు. కటువుగా - అప్పుడే టాయ్ పిస్టల్ని చేతిలోకి తీసుకున్నాడతడు.
ఆమె భయపడింది. వణికిపోయింది.
అతడామె నోట్లో గుడ్డలు కుక్కాడు. చేతులు వెనక్కు విరిచి కట్టేశాడు. కాళ్ళు కూడా పాదాల వద్ద దగ్గరలో ఉన్న తువ్వాలుతో కట్టేశాడు.
ఆమె అతడి వంక భయంగా చూసింది.
దక్షిణామూర్తి పక్క గదిలోనూ, బాత్రూం లోనూ యెవరైనా ఉన్నారేమోనని చూశాడు. ఎక్కడా యే విధమైన ప్రమాదమూ లేదని రూడి పర్చుకొని అతడు బయటకు వచ్చి బయట్నించి తలుపులు వేశాడు.
హడావుడిగా పక్క గది తలుపు తట్టి -- "అరుణా - నేను!" అన్నాడు.
అరుణ వచ్చి తలుపు తీసింది.
అతడు లోపలకు రాకుండా -- "లోపల నాకోసం ట్రాప్ ఉంది. ఓ వస్తాదున్నాడు. టాయ్ పిస్టల్ చూసి వాడు దడుచుకున్నాడు. వాణ్ని లొంగతీసేసాను. నేను వెళ్ళి పోలీసుల్ని పిల్చుకొని వస్తాను. చెంగల్రావు అట ఈ దెబ్బతో కట్టవుతుంది. ఈలోగా ఎవరొచ్చినా నువ్వు తలుపు తీయకు...." అన్నాడు.
"అనవసరంగా ప్రమాదంతో చెలగాటమాడుతున్నారేమో ...." అంది అరుణ కంగారుగా.
"చెలగాటమాడింది నేను కాదు - చెంగల్రావు. అరుణ కంగారుపడకు , నీకు జరిగిన ఆవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను...."
ఆమె తలుపులు వేసుకునేవరకూ అతడక్కడే ఆగాడు. ఆ వెను వెంటనే పక్క గది తలుపు తీసుకుని లోపలకు వెళ్ళాడు.
అక్కడ బంధించబడిన యువతి నిస్సహాయంగా దీనంగా ద్వారం వైపే చూస్తోంది.
అతడు తలుపు వేశాడు.
13
"ఎరా --- ఇడియట్ - మొత్తం మీద నీ దర్శనమయిందా నాకు...." అన్నాడు డీయస్పీ ఇందు భూషణ్ ఉత్సాహంగా.
"వచ్చిన పని కాలేదు కానీ -- ఓ మంచి పని చేసి వెడుతున్నానని తృప్తిగా వుంది. నాకు ....." అన్నాడు చెంగల్రావు.
"నువ్వు మంచి పనులు చేయనిదెప్పుడు ?" అన్నాడు ఇందుభూషణ్.
"ఒకే ఒక్క చెడ్డపని చేశాను. అదేకదా నాకు శాపమైంది...."
"ఆ విషయం మర్చిపో ...."
"ఎలా మర్చిపోనురా ? మర్చిపోయే అవకాశం లేకుండా చేశాడా మాధవ్ నాకు. అలాగని మాధవ్ నూ నేను తప్పుపట్టలేను...."
ఇందుభూషణ్ నిట్టూర్చాడు. ఆయనకు చెంగల్రావు బాధ తెలుసు.
చెంగల్రావు దగ్గర --- అయన వ్యాపార వ్యవహారాలు చూసేవాడు మాధవ్. అతడి భార్యది కళ్ళు చెదిరే అందం.
ఓ ఆడపిల్లను కని చెంగల్రావు భార్య కన్ను మూసింది. తన భార్య ప్రతిరూపాన్ని కూతుర్లో చూసుకుంటూ యెంతో అభిమానించాడామెను చెంగల్రావు. కూతురికి సవతి తల్లిని తేవడం ఇష్టం లేక మళ్ళీ పెళ్ళి చేసుకోలేడాయన. ఫలితంగా మాధవ్ మకాం చెంగల్రావింటికి మారిపోయింది.
మాధవ్ భార్య ఆ ఇంట్లో స్వంతింట్లోలా మసిలింది.
అప్పుడు చెంగల్రావు కూతురికి రెండేళ్ళు.
ఒకరోజున అనుకోని ఏకాంతంలో -- చెంగ'ల్రావు మనసు చలించింది. అయన మాధవ్ భార్యను బలవంతం చేశాడు. తన శాయశక్తులా ప్రతిఘటించి అయన పశు బలానికి లొంగి పోయిందామె.
తర్వాత విషయం ,మాధవ్ కి తెలిసిపోయింది. ఆ తర్వాత ఒకరోజున మాధవ్ కుటుంబం - చెంగల్రావ్ కూతురుతో సహా మాయమయింది. చెంగల్రావు ధన బలం పలుకుబడి - అయన కూతుర్ని వెతికి పెట్టలేక పోయాయి. అయితే అర్నెల్లెకోసారి ఆయనకుత్తరం వస్తుండేది .
"చెంగల్రావ్! నీ కూతురు నా వద్ద క్షేమంగా వుంది. ఆర్నెల్లకోసారి నేనామె యోగ క్షేమాలు తెలియబరుస్తుంటాను. నువ్వు నా భార్యకు చేసిన అన్యాయానికి ప్రతిఫలంగా నీకు నేను విధించే శిక్ష ఏమిటో తెలుసా? నీకిక స్త్రీ సుఖముండదు. నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకున్నా ఏ వేశ్యా వాటి కైనా వెళ్ళినా, ఇంటికి కాల్ గర్ల్సు ని రప్పించుకున్నా - నీ కూతురు ప్రాణాలకే ప్రమాదం గుర్తుంచుకో !"
ఉత్తరం ఒకసారి బొంబాయినుంచి, ఒకసారి కలకత్తా నుంచి, మరోసారి డిల్లీ నుంచి - ఇలా రకరకాల ప్రాంతాల నుండి వస్తుండేది.
"మర్చిపోక తప్పదు. ఆ మాధవ్ గాడు కనీసం కూతురి యోగ క్షేమాలు తెలియజేస్తున్నాడు. ఏదో ఒకరోజున నువ్వూ నీ కూతురూ తప్పక కలుసు కుంటారు. అన్నాడు ఇందు భూషణ్.
సరిగ్గా అప్పుడే కాఫీలు తీసుకుని వచ్చింది ఇందు భూషణ్ భార్య శాంత --- "కారణమేదైనా మీరు హోటల్లో మకాం పెట్టడం బాగోలేదు --" అందామె.
"మరోసారి వచ్చినపుడిలా చేయను -" అని హామీ ఇచ్చుకున్నాడు చెంగల్రావు. అయితే అతడికి ఇందు భూషణ్ తో ఏదో చెప్పాలని ఉంది . ఇందు భూషణ్ అది గమనించి -- "శాంతా! నా మిత్రుడికి కాఫీతో సరి పెట్టేయకు -- ఇడ్లీ- కారప్పొడి - కొబ్బరి చెట్నీ ...... వాడికేంతో యిష్టం -" అన్నాడు.
"మీరు టిఫిన్ తో సరిపెట్టేద్దామనుకుంటున్నారేమో ఈపూటకు మరిది గారి భోజనం కూడా యిక్కడే! అనుకోకుండా ఈరోజు మంచి వంకాయలు దొరికాయి. గుత్తి వంకాయ కూర మరిదిగారికిష్టమని నాకు తెలుసు ..." అని అక్కణ్ణించి వెళ్ళిపోయింది శాంత.
"ఏమిటో -- ఇప్పుడు చెప్పరా ?" అన్నాడు ఇందుభూషణ్.
"మాధవ్ నామీద గొప్పగా పగ తీర్చుకుంటూన్నాడు. ఇది చూడు ....' అంటూ ఓ ఉత్తరం అందించాడు చెంగల్రావు. ఇందుభూషణ్ ఉత్తరం చదివాడు.





