Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12
"ఎప్పుడో ఒక రోజున నువ్వు చేసిన తప్పులకు విచారిస్తావు. అప్పుడు నా పేరు చెప్పుకొని ఆ కత్తి తీసుకుని ఆత్మహత్య చేసుకో -" అని అరుణతో సహా అక్కణ్ణించి వెళ్ళిపోయాడు దక్షిణామూర్తి.
9
"బాబుగారూ మళ్ళీ వచ్చారు. కానీ ఈ సమయంలో వచ్చారేమిటి ?' అంది మంగాయమ్మ.
"ఇప్పుడైతే మొత్తం అందర్నీ చూడొచ్చు గదా అని వచ్చాను....సాయంత్రమైతే కొందరు బుక్కై పోతారు గదా అన్నాడు చెంగల్రావు.
అయన మాటలు మంగాయమ్మ కు అర్ధం కాలేదు- " ఈ సమయంలో వాళ్ళనేం చూస్తారు ? చాలామంది నిద్రపోతుంటారు .." అందామె.
"అందర్నీ ఉన్న వాటిలో మంచి బట్టలు వేసుకుని తయారుగా ఉండమను -" అన్నాడు చెంగల్రావు .
"ఎందుకు ?"
"అంతమంది వేశ్యల నొక్క చోట చూడడం అదో అనుభవం. అలనాటి శ్రీకృష్ణుడి అనుభవాన్ని తలదన్నాలి...." అని మాంగాయ,మ్మ ఏదో అనబోయేలోగా అయిదు వంద రూపాయల నోట్లామెకు అందించాడు చెంగల్రావు.
"ఒక్క అయిదు నిమిషాలు బాబుగారూ -- తమరిక్కడే కూర్చోండి . పైన హాలుంది. అందర్నీ అక్కడ చేర్చి వస్తాను." అంటూ మంగాయమ్మ హుషారుగా అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
చెంగాల్రావు హుందాగా అక్కడ కుర్చీలో కూర్చున్నాడు.
ఓ పావుగంటలో మంగాయమ్మ అక్కడకు వచ్చి - రండి బాబూ -- హాల్లోకి వెడదాం ...." అంది.
చెంగల్రావు వీధిలోకి వెళ్ళి మళ్ళీ లోపలకు వచ్చాడు. మంగాయమ్మ వెనుకనే నడిచాడు.
పాతకాలపు మేడ మెట్లు.....
అక్కడ పాతవాసన....
ముందు మంగాయమ్మ....వెనుక చెంగల్రావు.....
ఇద్దరూ హల్లో ప్రవేశించారు. అక్కడ సుమారు యాభై మంది స్త్రీలున్నారు. వారిలో చాలావరకూ చౌకబారు మనుషుల్లాగే ఉన్నారు. వయసోక్కటే వారిలోని ఆకర్షణ. అందులో అంతకుముందు తానేన్నుకున్న ఇద్దరు యువతులను కూడా గుర్తు పట్టాడు చెంగల్రావు. వాళ్ళాయన్ను చూసి పలకరింపుగా నవ్వారు. అయన నవ్వలేదు.
హాలుకు మొత్తం నాలుగు వైపులా తలుపులున్నాయి. వాళ్ళోచ్చిన ద్వారం తప్ప మిగతా ద్వారాలన్నీ మూసి వున్నాయి.
మంగాయమ్మ , చెంగల్రావు -- ఒకరికొకరు పక్కగా నిలబడ్డారు.
వాళ్ళ కెదురుగా వేశ్యలు....
"నేను సరిగ్గా పది అంకెలు లేక్కపెడతాను. అప్పుడు మీరందరూ నృత్యం ప్రారంభించాలి -" అన్నాడు చెంగల్రావు.
"నేను వెడతాను బాబూ -- "అంది మంగాయమ్మ.
"వద్దు . నాతొ కలిసి నృత్యం చూడడమే నాకు వినోదం-- నువ్వూ ఇక్కడే వుండు...." అన్నాడు చెంగల్రావు.
"ఇతగాడి వ్యవహారం తమాషాగా వుంది- " అనుకుంది మంగాయమ్మ.
చెంగల్రావు అంకెలు లెక్క పెట్టడం ప్రారంభించాడు.
ఒకటి, రెండు.... ఏడు.....ఎనిమిది.....తొమ్మిది....."పది !" అన్నాడాయన గట్టిగా.
వెంటనే వేశ్యలు నాట్యం ప్రారంభించబోయి ఆగిపోయారు.
అప్పుడే తెరచి వున్న అ ఒక్క ద్వారంలో ఇద్దరు వస్తాదులు అక్కడ ప్రవేశించారు.
ఇద్దరూ కండలు తిరిగి వున్నారు. వంటి మీద చొక్కాలు లేవు. ఆన్నిటికి మించి ఇద్దరి చేతుల్లోనూ కొరడాలున్నాయి.
"ఏమిటిది?" అంది మంగాయమ్మ కంగారుగా "
వస్తాదులు తలుపులు మూశారు.
"ఏమిటిది?" అంది మంగాయమ్మ.
"ఎవ్వరూ కదలకండి. కదిలితే కొరడా దెబ్బలు అన్నాడు చెంగల్రావు కరుకుగా.
వేశ్యలెవ్వరూ కదలలేదు. అందరి కళ్ళలోనూ చెప్పలేనంత భయం తొంగి చూస్తోంది. శ్రీరామ్ ను మించిన క్రూర శిక్ష తమపై అమలు జరుగబోతున్నదన్న అనుమానం వారిలో ప్రతి ఒక్కరికీ కలిగింది.
"ఏమిటిది?" అంది మంగాయమ్మ. యింకోసారి.
అదే ఆమె ఆఖరు మాట.
ఇద్దరు వస్తాదులు ఆమెను సమీపించారు. నోట్లో గుడ్డలు కుక్కారు. బట్టలు విప్పారు. చేతులూ, కాళ్ళూ కట్టేశారు. చెరో పక్కనా కొరడా ఎత్తి నిలబడ్డారు.
వేశ్యలంతా తెల్లబోయి చూస్తున్నారు.
"ఈరోజు మీకు విముక్తి దినం. ఇనప్పేట్టెలో డబ్బుంది. మీరందరూ సమంగా పంచుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపొండి. మిమ్మల్నేవ్వరూ అడ్డగించలేరు. శ్రీరామ్ ప్రస్తుతం జైల్లో వున్నాడు. అతడి అనుచరు లెవ్వరూ కొద్ది రోజుల వరకూ ఈ దరిదాపులలో కూడా అడుగు పెట్టారు. మీ యిష్టం వచ్చిన చోటికి వెళ్లి -- స్వతంత్ర్యంగా , గౌరవంగా బ్రతకండి. నాలుగిళ్ళలో పాచిపనులు చేసుకున్నా తప్పు లేదు. తిరిగి వ్యభిచారానికి మాత్రం పాల్పడకండి" అన్నాడు చెంగల్రావు.
వేశ్యలందరూ తెల్ల ముఖాలు వేశారు. జరుగుతున్నది కలో, నిజమో వారికి తెలియడం లేదు.
చెంగ;ల్రావు కొనసాగించాడు - "ఎవరి పాపానికైనా శిక్ష తప్పదు. గతంలో మిమ్మల్ని మంగాయమ్మ క్రూరంగా హింసించింది. ఆ హింస ఎలా ఉంటుందో ఆమెకూ తెలియజేయాలి. ఇప్పుడు భగవంతుడి తరపున నేనమలు జరిపే శిక్షను మీరందరూ కళ్ళారా చూసి వినోదించి అప్పుడే బయటకు వెళ్ళవచ్చు ఏమీ తొందర లేదు....." అని మంగాయమ్మ వైపు తిరిగి --"ఈ కంపెనీ పొతే నువ్వు కొత్త కంపెనీ పెడతావని నాకు తెలుసు. కానీఎప్పుడైనా ఎవరి నైనా క్రూరంగా హింసించావంటే నా ప్రతినిధి వచ్చి మళ్ళీ శిక్ష అమలు జరిపి వెడతాడు...." అన్నాడు.
చెంగల్రావు పక్కకు తప్పుకోగానే వస్తాదు లిద్దరూ కొరడాతో మంగాయామ్మ చెరో పది దెబ్బలు బాదారు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది.
"పదండి మనం పంకజం యింటికి వెడదాం!" అన్నాడాయన వస్తాదులతో.
10
తలుపు తీసిన అరుణ కంగారు పడి తలుపు వేయబోయింది. చెంగల్రావు బలవంతాన లోపలకు దూసుకు వెళ్ళి -- తలుపు మూసి - "కంగారుపడకు . నేను నిన్నేమి చేయను. ఒక విషయంలో నీ సాయం కోరి వచ్చాను--- అన్నాడు.
"ఏమిటది ?"
"ఈ ఉళ్ళో నాకింకా నాలుగు రోజుల పని ఉంది. ఇప్పుడు అనుకోకుండా నాకో పని తగిలి ఊరు వదిలి వెళ్ళాల్సివస్తుంది. రేపటికి వచ్చేస్తాను...."
'అయితే ?"
"పక్క గదిలో నా భార్య ఉంది. నా మీద కోపం కొద్ది దక్షిణామూర్తి ఆమె నేమైనా చేయవచ్చు. అందుకే నిన్ను వేడుకుంటున్నాను. నా వస్తాదులిద్దరూ నాతొ తీసుకుని వెడుతున్నాను. ఆమెకు వేరే రక్షణ లేదు...."
"హోటలు వాళ్ళకు చెప్పి వెళ్ళక పోయారా?"
"మన కధ వాళ్ళందరికీ తెలియడం నాకిష్టం లేదు......"
"డబ్బు, బలగం - రెండూ ఉన్నవాడి కిలా ఉన్నావు.. నీ భార్య కామాత్రం రక్షణ ఏర్పాట్లు చేసుకోలేవా ?' అందామె.
'చేసుకోగలను. కానీ నీ విషయంలో నిజం కూడా తెలుసుకోవాలనుంది. నీవు నిజంగా దక్షిణామూర్తి భార్యైతే అయితే నిన్ను మించి అతడి నుంచి నా భార్య ను రక్షించగల వారెవ్వరూ లేరు...." అన్నాడు చెంగాల్రావు. అరుణ నవ్వి -- "నా భర్త ముసలివాళ్ళ జోలికి వెళ్ళడు....." అంది.
"పడుచువాళ్ళ జోలికి వెళతాడా?" అన్నాడు చెంగల్రావు.
అరుణ తడబడి - "ఏమో నాకు తెలియదు ...." అంది .
"తెలుసుకోవడం నీకు మంచిది . నా భార్య వయసులో నీ కంటే చిన్నాదనుకుంటాను ...." అన్నాడు చెంగల్రావు.
"నువ్వు .....నువ్వు ....నాకంటే చిన్నదాన్ని పెళ్ళి చేసుకున్నావా ----అసలా పిల్లా యెలా ఒప్పుకుంది ?"
"నాకు డబ్బు, బలగం ఉందిలే!" అన్నాడు చెంగల్రావు. తర్వాత అయన అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
11
"ఇది మళ్ళీ ఏదో ట్రాప్ అయుంటుంది-" అన్నాడు దక్షిణామూర్తి.
"అయన వ్యవహారమంతా తమాషాగా ఉంది. పని కట్టుకుని వచ్చి తన భార్య సంగతి ఎందుకు చెప్పాడో నాకు తెలియడం లేదు ...." అంది అరుణ.
"గదిలోకి నిన్నూ నన్నూ రప్పించడానికిదో ప్రయత్నమనుకుంటాను. మన మొక పనిచేద్దాం. ముందు నేనక్కడకు వెడతాను. పావుగంటలోగా నేను బయటకు రాకపోతే నువ్వే బయటివాళ్ళ సాయంతో వచ్చి తలుపులు కొట్టు...." అన్నాడు.
"ఈ అయిడియా బాగుంది...." అందామె.
"జాగ్రత్తగా తలుపులు వేసుకో. పావుగంట లోగా నేను తప్ప ఎవరొచ్చినా తలుపులు తీయకు" అన్నాడు దక్షిణామూర్తి.





