Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 13
విమల ఉలిక్కిపడింది-"అంటే?" అన్నది. కానీ చురుగ్గా పని చేసే ఆమె మెదడుకు ఏదో అర్ధమవుతోంది.
చంద్రమ్మ నవ్వింది-"తెలివైనదానివి. నీకు వేరే అన్నీ చెప్పాలా? తీరుస్తానని మాటిస్తే నీకు నా కోరిక చెబుతాను-"
విమల ఆశ్చర్యంగా ఆమెవంక చూసింది-"అసలు నీ కోరిక ఏమిటో చెప్పు!"
"చెబుతాను. కానీ ఈ రోజు కాదు...." అంటూ మళ్ళీ నవ్వింది చంద్రమ్మ.
"నీకు ఓ రోజంతా వ్యవధిస్తాను. ఆలోచించుకుని నా కోరిక తీర్చాలన్న మంచి నిర్ణయానికిరా. రేపు రాత్రి నీకు మళ్ళీ కనిపిస్తాను. అప్పుడు నా కోరిక తీరుస్తానని మాటివ్వు. నీకు అన్నీ వివరంగా చెబుతాను-..."
విమల ఏదో అనాలనుకుంది కానీ ఉన్నట్లుండి ఆమెకు మళ్ళీ నిద్ర ముంచుకువచ్సింది.
3
కాలింగ్ బెల్ చప్పుడుకు విమలకు మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి లేచి టైము చూసుకుంది. ఏడయింది.
ఆమె సాధారణంగా ఉదయం అయిదున్నరకల్లా లేచిపోతుంది. అంత మొద్దు నిద్ర ఎలా పట్టిందో!
విమల వరుసగా ఒకో తలుపే తీసుకుంటూ వచ్చింది. వీధి తలుపు తీసి పనిమనిషిని లోనికి ఆహ్వానించింది. కాసేపామె ఇంటిపనుల్లో మునిగిపోయింది. అప్పుడామెకు రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది అంతే!
చేస్తున్న పని వదిలేసి పడకగదికి వెళ్ళింది. మొత్తం గది అంతా క్షుణ్ణంగా పరిశీలించింది. గదిలోనికి ఎవరూ రావడానికి వేరే దారి ఏమీలేదు.
ఆమె పేరు చంద్రమ్మ అని చెప్పింది.
గదిలోనికి ఎలా వచ్చింది?
కొంపదీసి తను కలగానీ కనలేదు కదా!
రాత్రి తను నైట్ మేర్ నవల చదువుతూ పడుకుంది. చదివిన ఆ రెండు పేజీల్లోనూ దెయ్యం ప్రసక్తి వున్నది. తనకలాంటి కల రావడానికి ఆ నవల చదవడమే కారణమా?
అయితే అది కలలాకాక అనుభవంలాగున్నది అది కలకాక నిజంగా అనుభవమే అయితే
విమలకు వళ్ళు జలదరించింది.
భోజనం చేశాక ఆమె పక్కింటికి వెళ్ళింది. తనకు వచ్చిన కల గురించి చెప్పాలనే ముందు అనుకున్నది. కానీ చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజామె పక్కింటి వాళ్ళమ్మాయి కళ్యాణిని సాయంగా పడుకోబెట్టుకోవాలని అనుకుంటున్నది. ఈ కల విషయం చెప్పడం వల్ల రెండు విధాల నష్టం.
కళ్యాణి భయపడి సాయం రాననవచ్చు.
తను ఒంటరితనానికి భయపడుతున్నదనుకొనవచ్చు.
విమల మొదటిది భరించగలదు కానీ రెండవది భరించలేదు.
ఆమె కళ్యాణిని సాయం పడుకోబెట్టుకోవాలనుకుంటున్న కారణం వేరు. రాత్రి తనకు నిజంగా కల వచ్చిందా-లేక చంద్రమ్మ కనిపించిందా?
చంద్రమ్మ కనిపించడమే నిజమే అయితే ఆమె ఈ రోజున మళ్ళీ కనబడతానంది. ఆమె ప్రభావం కారణంగా తనకు మళ్ళీ ఆ కల కొనసాగినా కొనసాగవచ్చు. తను భ్రమపడిందా-అది నిజమా అన్న విషయం-మరో మనిషి తోడు వుంటేగానీ తెలియదు. ఇద్దరు మనుషులు భ్రమపడడం-అందులోనూ ఒకే విధంగా భ్రమపడడం అన్నది అరుదుగా జరుగుతూంటుంది.
పక్కింటామె విమలను చూసి నవ్వుతూ-"ఏమిటమ్మా మీ ఆయనకోసం బెంగకానీ పెట్టుకున్నావా-అప్పుడే అదోలా కనబడుతున్నావు!" అంది.
విమల కూడా నవ్వేస్తూ-"బెంగ సంగతి ఎలాగున్నా నిన్న రాత్రి రోజూకంటే బాగా నిద్రపట్టింది. ఏడింటికి పనిమనిషి కాలింగ్ బెల్ కొట్టేవరకూ మెలకువే రాలేదు-" అంది.
"అవునులే-రోజూ మీ ఆయన నిన్ను నిద్రపోనివ్వడం లేదనుకుంటాను. అందుకే అన్ని రోజుల నిద్రా ఒక్కసారి పట్టేసినట్లుంది-" అందావిడ.
విమల కాస్త సిగ్గుపడింది.
కాసేపు అవీ ఇవీ కబుర్లయ్యాక-"రాత్రికి సాయంపడుకుందుకు మీ కళ్యాణిని పంపిస్తారా?" అంది.
పక్కింటావిడ నవ్వుతూ-"దానికేం-తప్పకుండా పంపిస్తాను. కానీ ఏమిటి విశేషం? ఒక్కర్తినీ పడుకునేందుకు భయంగా ఉందా లేక పక్కలో రెండో మనిషి లేకపోతే నిద్రరానంటోందా?" అంది.
ఆవిడకు ఎప్పుడూ భార్యాభర్తల గురించి మాట్లాడ్డం సరదా. ఆవిడ మాటలు వినడానికి ఒకోసారి సరదాగానూ వుంటాయి-ఒకోసారి చిరాకును కలిగిస్తూంటాయి. ఆవిడ ఎదుటివాళ్ళ గురించి పట్టించుకోదు. తన ధోరణి తనదే!
"చాలా థాంక్సండీ-" అంది విమల ఆవిడ ప్రశ్నలకు బదులివ్వకుండా.
"థాంక్సు నేనే నీకు చెప్పాలి-" అందావిడ.
"అదేంటండీ?" అంది విమల ఆశ్చర్యంగా.
"అవునమ్మా-అబ్బాయేమో పొరుగూళ్ళో, ఇంజనీరింగు చదువుతున్నాడు. అమ్మాయికి పధ్నాలుగేళ్ళొచ్చి గుర్రంలా ఎదిగింది. ఆయనేమో పగలంతా అతలాకుతలమై రాత్రింటికొస్తారు. యింట్లో వున్నవి రెండు గదులు. పెద్ద పెద్ద అద్దెలు పోసి ఎక్కువ గదులుండే ఇళ్ళు తీసుకోలేము. ఏదో నీలాంటివాళ్ళు పిల్ల ను సాయం పేరు చెప్పి తీసుకుని వెడితే తప్ప మాకూ కాస్త ఏకాంతంలో అచ్చటా ముచ్చటా చెప్పుకునే వీలేదీ-అందుకే నీకు థాంక్సు చెబుతున్నాను. నేను మర్చి పోయినా నువ్వే గుర్తుచేసి దాన్ని తీసుకువెళ్ళాలి సుమా!" అందావిడ.
"ఛీ-ఈవిడకి బొత్తిగా సిగ్గులేదు-" అనుకుంది విమల.
"ఏమ్మా-మాట్లాడవు...." అందావిడ.
విమల నవ్వుతూ-"నో మెన్ షన్!" అని అక్కన్నించి వెళ్ళిపోయింది.
4
రాత్రి కళ్యాణి తన ఇంటికి వచ్చేలోగా విమల ఇల్లంతా మరోసారి పరిశీలించి చూసి జరిగినదంతా మరోసారి గుర్తు తెచ్చుకుంది.
అసలేం జరిగింది?
రాత్రి తను పుస్తకం చదువుతూ నిద్రపోయింది. అంటే లైటు వేసే పడుకుని వుంటుంది. అయితే చంద్రమ్మ ఉన్నప్పుడు గదిలో బెడ్ లైటు వెలుగుతోంది. అదెలా జరిగింది? చంద్రమ్మ అసలు దీపం ఆర్పి బెడ్ లైట్ మనిషి తోడు వుంటేగానీ తెలియదు. ఇద్దరు మనుషులు భ్రమపడడం-అందులోనూ ఒకే విధంగా భ్రమపడడం అన్నది అరుదుగా జరుగుతూంటుంది.
పక్కింటామె విమలను చూసి నవ్వుతూ-"ఏమిటమ్మా మీ ఆయనక్సోం బెంగకానీ పెట్టుకున్నావా-అప్పుడే అదోలా కనబడుతున్నావు!" అంది.
విమల కూడా నవ్వేస్తూ-బెంగ సంగతి ఎలాగున్నా నిన్న రాత్రి రోజూకంటే బాగా నిద్రపట్టింది. ఏడింటికి పనిమనిషి కాలింగ్ బెల్ కొట్టేవరకూ మెలకువే రాలేదు-" అంది.
"అవునులే-రోజూ మీ అయన నిన్ను నిద్రపోనివ్వడం లేదనుకుంటాను. అందుకే అన్ని రోజుల నిద్రా ఒక్కసారి పట్టేసినట్లుంది-" అందావిడ.
విమల కాస్త సిగ్గుపడింది.
కాసేపు అవీ యివీ కబుర్లయ్యాక-"రాత్రికి సాయం పడుకుందుకు మీ కళ్యాణిని పంపిస్తారా?" అంది.
పక్కింటావిడ నవ్వుతూ-"దానికేం-తప్పకుండా పంపిస్తాను. కానీ ఏమిటి విశేషం? ఒక్కర్తినీ పడుకునేందుకు భయంగా ఉందా లేక పక్కలో రెండో మనిషి లేకపోతే నిద్రరానంటోందా?" అంది.
ఆవిడకు ఎప్పుడూ భార్యాభర్తల గురించి మాట్లాడ్డం సరదా. ఆవిడ మాటలు వినడానికి ఒకోసారి సరదా గానూ వుంటాయి-ఒకోసారి చిరాకును కలిగిస్తూంటాయి. ఆవిడ ఎదుటివాళ్ళ గురించి పట్టించుకోదు. తన ధోరణి తనదే!
"చాలా థాంక్సండీ-" అంది విమల ఆవిడ ప్రశ్నలకు బదులివ్వకుండా.





