Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12
ఆదలాగుంచితే ఆమె తన ప్రయాణం గురించి అబద్ద మెందుకు చెప్పింది? ముత్యాల్రావామే ఉళ్ళో లేదని కెందుకు చెప్పాడు? ఊరికి వెళ్ళకపొతే సూట్ కేసు మార్పిడి ఎలా జరిగింది?" అసలు సూట్ కేసుల మార్పిడి జరిగిందా?
అంతవరకూ ఆలోచించాక నా అలోచనలింక ముందుకు వెళ్ళలేదు. పద్మావతీ నాతొ అబద్దాలు చెప్పి ఉంటే అవెందుకో అర్ధం కావడం లేదు. అయితే అబద్దం చెప్పిందని నాకామే పై కోపం లేదు. అబద్దాల కారణంగా నాకామే లొంగిపోతే అంతకంటే నాక్కావలసిందేముంటుంది? ఎలాగో అలా ఆమెతో కొన్నాళ్ళు గడిపిన తర్వాత వదిలి పెట్టేయడమే నా అభిమతం తప్పితే అమెపూర్తి చరిత్రలో నాకు నిమిత్తం లేదు.
ఏది ఏమైనా మర్నాడు సాయంత్రం ఆరింటికి టంచనుగా పార్కుకి వెళ్ళి కూర్చున్నాను. ఆమె చెప్పేది వినాలన్న ఆత్రుతతో పాటు, ఆమె సమక్షమాధురిననుభవించాలన్న కోరిక కూడా వుంది.
అక్కడ బెంచీ మీద నేను ఒంటరిగా కూర్చున్నాను. సెకన్లు, నిముషాలు గడిచిపోతున్నాయి. టైము నాకు భారంగా గడుస్తోంది.
పద్మావతీ రావడం లేదు.
టైము అరుంపావయింది. ఆరున్నరయింది. ఆరూ నలబై అయిదయింది. అంతవరకూ టైము భారంగా గడిచింది.
టైము ఎడైతే ఇంక పద్మావతీ రానంది.
అప్పట్నించి గడియారం పరుగు తీయడం ప్రారంభించింది. కాలమిక్కడ స్తంభించి పోవాలన్నది నా కోరిక. టైము ఏడు దాటిందంటే పద్మావతి రాదు. ఆ తర్వాత మేము మళ్ళీ జీవితంలో కలుసుకోము.
నేను దిగులుగా వాచీ వంక చూసుకుంటూ దాన్నాపడానికి ప్రయత్నిస్తున్నాను. అది ఆగడం లేదు.
చూస్తుండగా టైము ఏడైపోయింది. నాకేమో ఏడు పోచ్చేసింది. ఇంక అక్కడుండడం వ్యర్ధమనుకుంటూ లేచాను.
అప్పుడు నా ఎదురుగా పద్మావతి!
తెల్లబోయాను.
"సరిగ్గా ఒక సెకన్ ముందు వచ్చాను. నువ్వు వాచీ చూసుకుంటూ నన్నుచూడలేదు...." అంది పద్మావతి.
"నువ్వు నిజంగా వచ్చావా? ఇంక రావానుకున్నాను."
"ఈ రోజు రావడాని కిబ్బందే అయింది. మాములుగా అయితే రాకపోదును , కానీ ఈరోజు కలుసుకోకపోతే ఇక జీవితాంతం కలుసుకోమన్నానుగా అందుకని వచ్చేశాను...." అంది పద్మావతి.
ఆమె బెంచీ మీద కాస్త దూరంగా నా పక్కనే కూర్చుంది. నేనూ కూర్చున్నాను. నా మనసులో ఇప్పుడెంతో సంతోషంగా వుంది. పద్మావతి వచ్చేసింది. ఇంకా ఈ జీవితానికే ఆమెను కలుసుకోవడం కుదరదేమోనని భయం వేసింది. ఆ భయమిప్పుడబద్ధమైంది.
"అలస్యమయిందేం?" అన్నాను.
"అన్న టైముకే వచ్చానుగా!" అంది పద్మావతి.
"అవును - ఏడుకి సరిగ్గా ఒక్క సెకను ముందు --" అన్నానుక్రోషంగా.
"రావడం ఆరూ నలభైకే వచ్చాను కాని నీ ఓపిక పరీక్షించాలనిపించింది. నిజంగా నీ ఓపిక మెచ్చుకోతగ్గది...."
"నా ఓపిక అంత గొప్పది కాదు, ఆ ఎదురుచూపు నీకోసం కాబట్టి ....యింత సేపున్నాను."
పద్మావతి ముఖం గంబీరంగా అయిపొయింది-- సహనానికి కారణం నీకు నామీదున్న ప్రేమ, ప్రేమకిక పరీక్ష పెట్టను. నా గురించిన అసలు నిజం చెప్పేస్తాను. అయితే ఆ నిజం నువ్వు భరించగలవా" అని భయపడుతున్నాను...."
నేను కుతూహలంగా ఆమె వంక చూస్తూ -- "నీ అందం గొప్పది. అది నన్నాకర్షిస్తోంది. ఆ ఆకర్షణలో ఎలాంటి నిజమూ నన్ను భయపెట్టలేదూ -- " అన్నాను.
"అయితే నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా ?" అంది పద్మావతీ.
ఆమె అంత సూటిగా అలా అడిగేస్తుందని నేనూహించలేదు. అయితే తెలివైన మగాడిక్కడే తటపాటాయించకూడదు. కేవలం మోసం చేయడానికే పరిచయం చేసుకుంటున్నప్పటికీ ప్రియురాలు పెళ్ళి ప్రసక్తి తీసుకురాగానే ఊ అనేయాలి. ఊ అనడం పెళ్ళి కాదు కదా!
"అసలలాంటి అనుమానం నీకెందుకొచ్చింది అన్నాను.
"నీకు గోపీ చంద్ తెలుసా?" అంది పద్మావతీ.
"గోపీచంద్ ఎవరు?" అన్నాను ఆశ్చర్యంగా.
"పోనీ దియేటర్ చలిత తెలుసా?" అంది పద్మావతి.
"ఓహ్ --- ఆ గోపీచందా" అన్నాను..... వెంటనే మా ఊళ్ళో "థియేటర్ చలిత" వెలసి ఏణార్ధం దాటింది. ఆ హాలు కట్టడానికి రమారమి కోటిన్నర అయిందని చెప్పుకుంటారు. దియేటర్లో సినిమా సంగతెలా గున్నా అ ధియేటర్ చూడ్డమే ఓ అనుభవం.
ఆ ధియేటర్ యజామాని గోపీ చంద్. అంతకు ముందాయనకు పెద్దగా పేరు లేకపోయినా ధియేటర్ కట్టేక చలిత గోపీచంద్ అని అయన గురించి చెప్పుకుంటున్నారు. ఆయనకు రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం దాకా గొప్ప పలుకుబడి వుందని అంతర్జాతీయ స్మగ్లరని కూడా చెప్పుకుంటారు. అయన తలచుకుంటే క్షణాల మీద నాయకుల్ని నేలమట్టం చేయగలడు. బిచ్చగాళ్ళను నాయకుల్ని చేయగలడు. దేశ ప్రధానికి ఆ పార్టీ ఎంపీ లైనా భయపడక పోవచ్చు కానీ గోపీచంద్ మాటంటే అయన అనుచరులకు సుగ్రీవాజ్ఞా అంటారు. అయన అనుచరులందరూ ఎవరికి వారు సమాజాన్ని గుప్పిట్లో ఇరికించుకున్నవారే!
"అయితే గోపీచంద్ గురించి నీకు పూర్తిగా తెలుసా?" అంది పద్మావతి.
"ఊ" అన్నాను.
"నాకోసం నువ్వు గోపీచంద్ ని హత్య చేయగలవా?"
"ఉలిక్కిపడి -- "ఏమిటి ?" అన్నాను.
"వినబడిందా - మళ్ళీ చెప్పాలా?"
"గోపీచంద్ ని హత్య చెయడమెందుకూ?"
"నువ్వు చేయగలవా .... ముందు చెప్పు....."
"గోపీచంద్ నే కాదు, ఏ మనిషినీ నేను హత్య చేయలేను...."
అప్పుడు పద్మావతీ సాలోచనగా "పోనీ ఇంకోపని చెబుతాను " అంది.
పద్మావతి మాటలు తమాషాగా వున్నాయి. ఆమె ఏం చెప్పబోతుందా అని ఆలోచిస్తూ --" చెప్పు -- అన్నాను.
"నీకు దయానిధి తెలుసా?"
వినగానే ఆ పేరెక్కడో విన్నట్లే అనిపించింది. సాలోచనగా ఊళ్ళో వున్న దియేటర్లు గుర్తు చేసుకుందుకు ప్రయత్నిస్తూ "ఏ దియేటరో చెప్పు -" అన్నాను.
"దియేటర్ కాదు- హోటల్ - హోటల్ అవాతార్ ."
అవతార్ దయానిధి అనగానే అర్ధమైపోయింది. మా ఊరి చీకటి బజార్ పూర్తిగా అయన అధీనంలో వుందని చెప్పుకుంటారు. ఊళ్ళోని గూండాలందరూ అయన చెప్పు చేతల్లో ఉంటారంటారు. దయానిధి కీ గోపీచంద్ కి అట్టే పడదు.
"ఆ ఆ దయానిధి తెలుసు...." అన్నాను.
"అతడి దగ్గర పాతిక లక్షలు విలువ చేసే రెండు అపురూప వజ్రాలున్నాయి. అవి దొంగతనం చేసి సంపాదించి నాకివ్వాలి ...." అంది పద్మావతి.
"పద్మావతీ! నేను సినిమా హీరోను కాదు. మామూలు ప్రేమికుడిని. నా శక్తికి తగ్గ పని చెప్పు చేస్తాను...." అన్నాను.
"నీచేత పని చేయించుకోవడం నాకు సరదా కాదు -- నీ శక్తికి తగ్గ పని చెప్పడానికి! నేను నీకు నా అవసరాన్న్జి బట్టి పనులు చెప్పాను...." అంది పద్మావతి.
అప్పుడామే ముఖం గంబీరంగా వుంది. సరదాగా ఆ మాటలన్నదని నా కనిపించలేదు - "గోపీచంద్ చావుకూ, దయానిధి వజ్రలకూ, నీకు నాకు యేమిటీ సంబంధం?" అన్నాను నేనూ గంబీరంగా.
"విడదీయలేని భయంకరమైన బలమైన అనుబంధమది చెబితే నువ్వు తట్టుకోగలవా?" అంది పద్మావతి.
"సస్పెన్సు వద్దు. వెంటనే చెప్పేసెయ్ ...."
"నేనో విష వలయంలో ఇరుక్కున్నాను. నన్నిరికించినవాడు గోపీచంద్ ---" అంది పద్మావతి.
"అయితే ?"
"ప్రస్తుతం నేను గోపీచంద్ కు స్మగ్లింగ్ వ్యవహారాల్లో సాయపడుతున్నాను...." అంది పద్మావతి.
ఉలిక్కిపడ్డాను. ఒక్క క్షణం నాకు బుర్ర పనిచేయలేదు.
"ఈ విషయం నీకు చెప్పాలా చెప్పకూడదా అని నిన్న రాత్రి , ఈ పగలు అలోచించి చివరకు చెప్పాలనే నిర్ణయానికి వచ్చాను--" అంటూ ప్రారంభించింది పద్మావతి.
"ఇదంతా ఎలా జరిగింది ?" అన్నాను.
"మా నాన్న గోపీచంద్ దగ్గర మాములుగా పని చేస్తుండేవాడు. ఒకరోజు నాన్న గోపీచంద్ డబ్బు బ్యాంకు నుంచి తెస్తుండగా యెవరో కొట్టేశారు. మొత్తం ముప్పై వేలు. అది కావాలని గోపీచంద్ యిరికించాడో, కాకతాళీయంగా జరిగిందో తెలియదు. గోపీచంద్ నాన్నను క్షమించి నన్నూ ఆయన్నూ కలిపి స్మగ్లింగ్ లోకి దింపాడు. మొదట్లో మాకది స్మగ్లింగు వ్యావహరమని తెలియదు..."
"తెలియకుండా యెలా వుంటుంది -- అందులోనూ స్మగ్లింగ్ వ్యవహరం?" అన్నాను. ఎందుకంటె అబద్దమాడినా అది అతికినట్లుండాలి కదా!
"అయితే నాకు నువ్వు స్మగ్లింగు వ్యవహారంలో తెలిసే సాయం చేశావా?" అంది పద్మావతి.





