Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12
అప్పుడు పద్మావతీ "వ్యవహారం చూస్తె అలాగే వుంది. తాళం మాదే -- సూట్ కేసే మాది కాదనుకోవాలి" అంటూ ఓసారి సూట్ కేసు వంక చూసి "అరె- దీని మీద పేరు వేరేగా వుందే!" అంది.
ఎస్ పి అని వుండాల్సిన అక్షరాలకు బదులు జి.ఎస్ అని వున్నాయి. పరీక్షించి చూడగా సూట్ కేసు పక్కన వున్న చిన్న ఖాళీలో ఓ కార్దుంది . అందులో జి.సుకుమార్ అనే అతడి అడ్రసుంది.
"సూట్ కేసులు మారిపోయాయి నాన్నా!" అంటూ పక్కనే కుర్చీలో కూలబడిపోయింది పద్మావతి.
"అదెలా జరిగిందే?" అన్నాడు ముత్యాలరావు.
"ఈరోజుల్లో అందరివీ ఒకేలాంటి సూట్ కేసులు, మార్పు పొరపాటున జరిగుంటుంది తప్పితే కావాలని యెవరూ చేసి వుండరు" అంది పద్మావతి నీరసంగా.
"మన సూట్ కేసు ఇప్పుడే ఊరు వెళ్ళిపోయిందో?" అన్నాడు ముత్యాలరావు భయంగా.
అప్పుడు నా బుర్ర చురుగ్గా పనిచేసింది. ఆ అడ్రసున్న సుకుమార్ ది ఊరే! అంటే ట్రయిన్ లోనో బస్సులోనో దిగేటప్పుడు సూట్ కేసులు మారి వుంటాయి. అదే చెప్పాను.
"అంటే సూట్ కేసీ ఊళ్ళోనే వుంటుందంటావు...." అన్నాడు ముత్యాల్రావు తెచ్చి పెట్టుకున్న ఉత్సాహంతో.
"ఈ ఉళ్ళో కాదు, పక్కింట్లోనే ఉన్నా సరే -- నేనిప్పుడెక్కడికి కదల్లెను " అంది పద్మావతీ.
'అలాగంటే ఎలా ?" అన్నాడు ముత్యాల్రావు.
'ఇంటికి రాగానే ఈయన కనబడ్డారు. సరదాగా కబుర్ట్లు చెప్పుకొవచ్చు గదా అని ఆశపడ్డాను. ఇప్పుడు సూటి కేసు మార్పిడి తెలియగానే వంట్లో ఓపిక పోయింది" అంది పద్మావతీ నిట్టుర్చుతూ.
పద్మావతిని చూస్తె నాకు జాలేసింది. అందమైన అడపిల్ల ఇబ్బంది పడుతుంటే ఏ మగాడూ చూస్తూ ఊరుకోలేడు గదా!
"మీ కభ్యంతరం లేకపోతె నేను సాయపదతాను " అన్నాను.
'అయ్యో! మిమ్మల్ని శ్రమ పెట్టడమా?" అంది పద్మావతి.
"అబ్బే -- నీకెందుకు బాబూ -- శ్రమ!" అన్నాడు ముత్యాల్రావు.
"ఇందులో నాకు శ్రమ లేదండి ...." అన్నాను.
వాళ్ళో పట్టాన అంగీకరించలేదు. ఒప్పించాను.
5
నేను వెళ్ళేసరికి సుకుమార్ ఇంట్లో చాలా హడావుడిగా వుంది. మార్పిడి జరిగిన సూట్ కేసు గురించి ఇంటిల్లిపాదీ కలవరపడిపోతున్నారు. విశేషమేమిటంటే పద్మావతి సూట్ కేసుకు తాళం వేసినట్లు లేదు. వాళ్ళు తెరిచి అందులోని ఆడవాళ్ళ బట్టలూ అవీ చూసి సుకుమార్ వెళ్ళిన పని మరిచి ఏదో వ్యవహారం నడుపుకోచ్చాడని అనుమానిస్తున్నారు.
ఇంట్లో ఎవరూ అందమైన ఆడపిల్లలు లేరు. అందుకే వయసులో వున్నవాళ్ళే లేరు. ఇద్దరాడవాళ్ళున్నారు . ఒకామె అతడి తల్లై ఉండవచ్చు. రెండో ఆమె బామ్మ అయుంటుంది.
నేను సూట్ కేసుతో వెళ్లి జరిగింది చెప్పాను. వాళ్ళ ముఖాలింతంతయ్యాయి. సుకుమార్ తన సూట్ కేసును లోపలకు తీసుకెళ్ళి కాసేపట్లో తిరిగి వచ్చి -- చాలా థాంక్సండీ ....పెట్టె యధాతధంగా చేరింది నాకు...." అన్నాడు.
నేను పద్మావతీ సూట్ కేసు తీసుకుని తిరిగి ముత్యాల్రావు ఇంటికి వెళ్ళాను. తమ సూట్ కేసు తిరిగి వచ్చినందుకా తండ్రీ కూతుళ్ళు మహదానందం పొందారు.
పద్మావతీ తను కూడా సూట్ కేసును లోపలాకు తీసుకెళ్ళింది. ముత్యాల్రానామే అనుసరిస్తూ -- "ఒక్క క్షణం నాయనా!" అన్నాడు.
నేను మౌనంగా నవ్వి కూర్చున్నాను.
వాళ్ళిలా లోపలకు వెళ్ళగానే అలా ఓ నడి వయస్కుడు వచ్చాడు. నన్నక్కడ చూసి కంగారుగా "పద్మావతీ యింట్లో లేదా ?" అన్నాడు.
"ఉందండీ-- మీరెవరు ?" అన్నాను.
"నువ్వెవరో తెలుసుకోవచ్చా?" అన్నాడాయన.
అయన చనువు కాశ్చర్యపడుతూ "నేనామె స్నేహితుణ్ణి " అన్నాను.
"ఎన్నాళ్ళయింది మీ స్నేహం ప్రారంభమై?" అన్నాడాయన చురుగ్గా నా కళ్ళల్లోకి చూస్తూ.
"ఓ వారం రోజులవుతుంది?" అన్నాను.
"చూశావా -- ఈ విషయం పద్మావతి నా దగ్గర దాచి పెట్టింది..." అని "ప్రస్తుతం కొంతకాలంగా పద్మావతి ఆరోగ్యం బాగుండడం లేదు. ఆమె ఎటువంటి ఆవేశానికి గురి కాకూడదు. పదిరోజుల్నించీ నేనామెను స్వయంగా వచ్చి అయిదారు గంటల కొకసారి పరీక్షించి వెడుతున్నాను." అని 'అన్నట్లు నేనెవరో నీకు చెప్పలేదు కదూ --- వీళ్ళకూ ఫామిలీ డాక్టర్నీ . పేరు శ్రీనివాస మూర్తి .." అంటూ చేయి చాపాడు.
ఇద్దరం కరచాలనం చేసుకున్నారు.
అయన మళ్ళీ చెప్పసాగాడు. "నిన్న రాత్రి పది గంటలకైతే ఆమె పరిస్థితి బొత్తిగా బాగోలేదు. సాయంత్రం నాలుగింటి నుంచి పదిలోగా అంట మర్పెట్లు వచిందో నాకర్ధం కాలేదు. ఈరోజు దయం ఎనిమిదింటికి మధ్యాహ్నం రెండింటికి కూడా ఆమెను పరీక్షించి మందులిచ్చి వెళ్ళాను. అవతల నాకు బోలెడు ప్రాక్టీసు , మా యిల్లు చాలా దూరం . పద్మావతి అంతంత దూరం ప్రతి రోజూ ప్రయాణం చేయడం మంచిది కాదని నేనే బయల్దేరి వీళ్ళింటికీ వస్తున్నాను.....ఇప్పుడు నిన్ను చూడగా నా కర్ధమైంది. నువ్వు చాలా బాగున్నావు. నీతో పరిచయం ఆమెను ఎమోషనల్ గా డిస్టర్బ్ చేస్తోంది ఆదామే ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పటి ఆమె అనారోగ్యానికి నువ్వే కారణం ...."
నేను తెల్లబోయి అయన మాటలు వింటున్నాను . పద్మావతీని నిన్న రాత్రి , ఈ వేళా పరీక్షించానంటాడేమిటి ? ఆమె ఉళ్ళో లేదు కదా ....
నేనాలోచిస్తుండగానే పద్మావతి , ముత్యాలరావు తిరిగి వచ్చారు. ఏదో చెప్పబోయిన పద్మావతి డాక్టరు శ్రీనివాస మూర్తి ని చూసి తడబడి "నమస్తే డాక్టర్ అంది.
ముత్యాల్రావు కూడా తడబడుతూ "ఈ వేళప్పుడొచ్చారేమిటి డాక్టర్!" అన్నాడు.
శ్రీనివాస మూర్తి వెంటనే "మధ్యాహ్నం నేనిచ్చిన రెడ్ కాప్యుల్స్ చాలా పవర్ ఫుల్. వాటి రియాక్షన్ ఎలాగుందో తెలుసుకోవాలనిపించింది. ఉండబట్టలేక వచ్చేశాను. సరిగ్గా మూడింటికి వేసుకోమని చెప్పను. వేసుకున్నావా?" అన్నాడు.
అప్పుడు చూడాలి పద్మావతి ముఖం. అందమైన ఆమె ముఖం వివర్ణమైంది. ఆమె క్షణ కాలం నన్ను చూసి ముఖం తిప్పెసుకుంది. తర్వాత డాక్టరుతో "వేసుకున్నాను డాక్టర్!" ఏమీ కాలేదు...." అంది.
ఆ తర్వాత శ్రీనివాస మూర్తి, పద్మావతీ పక్క గదిలోకి వెళ్ళారు. తలుపులు మూసుకున్నారు. పది నిముషాల్లో యిద్దరూ తిరిగొచ్చారు. ఈ పది నిముశాల్లోనూ నేను ముత్యాలరావు -- ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. నాలో చాలా ప్రశ్న లుదయించాయి. అవన్నీ పద్మావతి వచ్చేక అడగాలను కున్నాను. నేనడగబోయే ప్రశ్నలేలా వుంటాయో , వాటికేమేం సమాధానాలు చెప్పాలో అని ముత్యాల్రావాలోచిస్తున్నాడు కాబోలు!
తిరిగొచ్చాక శ్రీనివాసమూర్తి "నేను మరీ మరీ చెబుతున్నాను. నువ్వింటిపట్టునే వుండాలి. ఇంక సెలవు ...." అని వెళ్ళిపోయాడు.
"డాక్టరు గారికి అమ్మాయ్యంటే కన్నకూతురి కంటే అభిమానం...." అన్నాడు ముత్యాల్రావు నిట్టుర్చుతూ.
నేను చటుక్కున "ఆ అభిమానమే మీ అబద్దాలను బయట పెట్టింది. అయన మీ అమ్మాయిని యింట్లో నిన్న రాత్రి ఒకసారి, ఈరోజుదయం , మధ్యాహ్నం పరీక్ష చేసి వెళ్ళానంటున్నాడు" అన్నాను.
"అయన నాకు తండ్రి లాంటి వాడు. నన్నాయన పరీక్షించడంలో తప్పేముంది ?" అంది పద్మావతి.
ఆమె విషయాన్ని తప్పుదోవ పట్టిస్తోందని నాకర్ధమైంది. "తప్పేమీ లేదు, కానీ మీరిద్దరూ చెప్పిన దాని ప్రకారం ఆ సమయంలో మీ రూళ్లో లేరు ...." అన్నాను.
పద్మావతి నిట్టూర్చి "మీరు సూట్ కేసు వెనక్కు తెచ్చి యిచ్చి నాకు చాలా గొప్ప ఉపకారం చేశారు. మీ దగ్గర దాయకుండా నిజం చెప్పేయాలని పిస్తోంది" అంది.
"ఏమిటా నిజం !" అన్నాను.
పద్మావతి ఏదో చెప్పబోగా ముత్యాల్రావు వారించి "చూడమ్మా! మనకిది జీవన్మరణ సమస్య. ఇలాంటి విషయాల్లో తొందర పాటు పనికిరాదు. ఒకరోజుంతా స్థిమితంగా ఆలోచించుకుని అప్పుడేం చేయాలంటే అది చేయొచ్చు" అన్నాడు.
"ఇప్పటికే ఆయనకు చాలా కోపం వచ్చింది నాన్నా!" అంది పద్మావతి.
ముత్యాల్రావు వెంటనే నావైపు తిరిగి "చూడు బాబూ! నువ్వు మా అమ్మాయి క్షేమం కోరే మంచి స్నేహితుడివని నమ్ముతున్నాను. దాని క్షేమం కోరి ప్రస్తుతానికి నిజమేమిటని నొక్కించవద్దు. సమయం వచ్చినపుడు - అన్నీ నేనే చెబుతాను. నువ్వపార్ధం చేసుకుంటావని భయపడి అది నిజం చెప్పేస్తానంటుంది. నిజం చెప్పడం వల్ల దాని ప్రాణాలే పోవచ్చు. అలా జరగడం నీకిష్టముంటుందా?" అన్నాడు.
"అయితే నేను సెలవు తీసుకుంటాను....." అంటూ లేచాను. వెళ్ళేటప్పుడు పద్మావతీ ఇంట్లోంచి బయటకు వచ్చి సందు చివరి దాకా నన్ననుసరించింది.
"నూతన్!" నన్ననుమానించకు. రేపు నీకు నేను అన్నీ చెప్పేస్తాను. తప్పకుండా పార్కుకి రా....ముందు మనమనుకున్న చోటుకే ...." అంది పద్మావతి.
"ఆలోచించాలి!" అన్నాను.
"నువ్వలాగంటె , ఈ రాత్రంతా నాకు నిద్రపట్టదు. ప్లీజ్....నన్ననుమానించడం లేదని ఒక్కమాట చెప్పు" అంది పద్మావతి.
"రేపు తప్పకుండా వస్తావా?" అన్నాను.
ఉన్నట్టుండి మా యిద్దరి మధ్యా అంతలా దూరం తగ్గిపోవడం నాకాశ్చర్యం కలిగించింది. ఆమె నన్ను నూతన్ అని పిలుస్తుంటే ఎంతో తీయగా, పరవశంగా వుంది. ఒక్కసారి మా యిద్దరి మధ్యా అంతటి చనువును కల్పించిన ఈనాటి అబద్దాలక్కూడా నేను కృతజ్ఞుడిని.
"తప్పకుండా వస్తాను. ఒకవేళ రాకపోతే మనమింక మళ్ళీ జీవితంలో కలుసుకోవద్దు. సరిగ్గా అరుకూ ఏడుకూ మధ్య వస్తాను. మధ్యలో విసిగి వెళ్ళిపోకు నువ్వు" అంది పద్మావతి.
"సరే!" అన్నాను.
6
ఆరోజంతా నా మనసు మనసులో లేదు, పద్మావతిని వల్లో వేసుకుందామని ప్రయత్నించాను. వాటం చూస్తె నేనే ఆమె వల్లో పడ్డానా అనిపిస్తోంది.
మా పరిచయం కాకతాళీయంగా జరిగిందా, కావాలని ఆమె నన్నిందులోకి లాగిందా అన్నది ఎంత ఆలోచించినా నాకు అంతుబట్టడం లేదు. టీ పేరు చెప్పి నాన్నామే తనంటికి పిలిచిన మాట నిజం! అయితే నా అంతట నేనే ఆమెను టీ గురించి అడిగాను.





