Home » History » ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర


21. యుగంధరుడుగా ప్రఖ్యాతిగాంచిన రెండవ ప్రతాపరుద్రుని ప్రధానమంత్రి సాగి గన్నమ నాయుడు కమ్మ కులజుడు. 1323 లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం మహమ్మదీయ పరిపాలనలో హిందువులు పడే బాధలను సహించలేక ఆంధ్రదేశములోని 75 గురు సావంత నాయకరాజు లంతా ముసునూరి ప్రోలయ నాయకుని నాయకత్వం క్రింద ఏకమై గెరిల్లా యుద్ధాలుచేసి 'కాకతీయ సామ్రాజ్య పునఃప్రతిష్ఠాపన' పేరిట తిరిగి రాజ్యస్థాపన చేసి గోదావరి ఒడ్డున భద్రాచలం దగ్గరవున్న రేకపల్లి రాజధానిగా చేసికొని ప్రోలయ నాయకుడు, ఆయన అన్న కుమారుడు కాపయ నాయకుడు 1325 నుండి 1369 వరకు 44 సంవత్సరములు ఆంధ్ర రాజ్యపరిపాలన చేసినారు. ముసునూరి నాయకులిద్దరు కమ్మవారే. వారిలో చివరివాడైన కాపయనాయకుని అనంతరంమే ఆంధ్ర సామ్రాజ్యము అంతఃకలహముల మూలమున పతనమై చివరిసారిగా మహమ్మదీయుల వశమైనది.

విజయనగర సామ్రాజ్య స్థాపన :

22. కాకతీయ సామ్రాజ్యంలో కోశాధ్యక్ష, మంత్రి పదవులు నిర్వహించిన హరిహరరాయలు, బుక్కరాయలను సోదరులు కాకతీయ సామ్రాజ్య పతనం తరువాత విద్యారణ్య స్వాములవారి సహాయంతో 1336 వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య స్థాపన చేసిన విషయం అందరూ అంగీకరించినదే. అయితే యీ హరిహరరాయలు, బుక్కరాయలు ఎవరు?

23. జియాఉద్దిన్ అనే ముస్లిము చరిత్రకారుడు హరిహరరాయలు బుక్కరాయలు ముసునూరి కాపయ నాయకుని బంధువులని, అందువలన విజయనగర సామ్రాజ్య స్థాపన సమయంలో పెక్కు యుద్ధములలో కాపయ నాయకుడు వారికి సహాయము చేసెనని వ్రాసినాడు. వీరిద్దరు సంగమ వంశీకులు; హరిహరుడు 1336-56 వరకు, బుక్కరాయలు 1356-77 వరకు పరిపాలన చేసిరి. ఈ కాలంలోనే కడప మండలంలోని గండికోట రాజ్యమును పెమ్మసానివారు పరిపాలన చేసిరి. వీరు విజయనగర సామ్రాజ్యానికి తమ సహాయ సహకారములనందించుతూ పెట్టని కోటవలెనుండిరి. పెమ్మసానివారు ప్రముఖులైన కమ్మవారు.
 




Related Novels


ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర

Diviseema Uppena 1977

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.