Home » History » ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర
సంస్కృత భాషలో రచించి, నర్తక లోకమునకు విలపటై, వదాన్య శేఖరుడని పేరొందెను. ఈ నృత్యశాస్త్రము నాట్య గ్రంథము లన్నిట మిన్నయైనది. జాయప సేనాని 'నృత్యరత్నావళి' యందలి నాట్యబంధ లక్షణములకు అనుగుణముగా రామప్ప దేవాలయమున నర్తకీ విగ్రహములు చిత్రింప బడినవని శ్రీకోన వేంకటరాయశర్మ జాయప సేనానిని గురించి 'గుంటూరు మండల నర్తకనృత్యములో' ఉద్ఘాటించినారు.
18. దర్పాణదేవి పురాణములో 'భవిష్యత్తులో కమ్మవంశంలో ప్రతాపరుద్రుడు జన్మించునని, మరియు క్రమరాజు వంశమున కాకతి రాజు పుట్టును.' అని ఉన్నది.
19. ఒకప్పుడు రెండవ ప్రతాపరుద్ర చక్రవర్తి తన పొరుగురాజు దండ యాత్రను అణుచుటకు కమ్మసేనను పంపగా వారు ఓడిపోయిరి. తరువాత, రాజు వెలమ సేనను పంపదలచగా వెలమ సేనాని రాజుగారికి సహపంక్తి భోజనాన్ని తమ గెలుపుకు పారితోషికంగా అడిగినారు. వెలమసేన యుద్ధంలో గెలిచిరావడం, వెలమ సేనకు సహపంక్తి భోజన కోరిక తీర్చడం జరిగింది. ఇది బ్రహ్మనాయుని అనుచరులుగా వుండిన కమ్మవారు వెనుకబడిన కులాలకే కలసి చేసిన చాపకూటి భోజనాల వలన పోగొట్టుకున్న సాంఘికస్థాయి (social status) ని తిరిగి పొందుటకు చేసిన తీవ్ర ప్రయత్నమనుటలో సందేహము లేదు.
20. అంతేకాదు, రెండవ ప్రతాపరుద్ర చక్రవర్తి తన పాలనలో కమ్మవారి పట్ల, వెలమ వారిపట్ల ఎక్కువ అభిమానము గల్గి, అధికార పదవులు వారికే ఎక్కువగా కట్టబెట్టినాడనే కారణముచేత ఢిల్లీ సుల్తానుకు, కాకతీయులకు జరిగిన ఆఖరి యుద్ధములో రెడ్డిసేన సహకరించనందు వలన అప్పటికే ఎన్నో యుద్ధములలో ఎక్కువ సేననష్టమైనందున ఆంధ్ర సామ్రాజ్యంలో ఆంధ్ర - హిందూపాలన అంతరించింది. చివరకు తమకు దేశద్రోహులన్న అపవాదును పోగొట్టుకొనుటకు, వారి తప్పిదాన్ని తెలిసుకొని సరిదిద్దుకొనే ప్రయత్నంలో మరల కాకతి సేనలకు రెడ్డి సేన సహకారము యిచ్చినా కూడా ప్రయోజనం లేకపోయింది. పై విషయముల వలన రెడ్డి, వెలమవారల కంటే కాకతీయులకు-కమ్మవారికి సన్నిహిత సంబంధాలు వుండేవని తెలుస్తున్నది.



