Home » History » ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర


1. బుద్ధుని కాలంలో ఉత్తర దక్షిణ భారతముల మధ్య మంచి రవాణా సౌకర్యాలు ఉండేవి. గుంటూరు జిల్లాలోని అమరావతి భట్టిప్రోలు బౌద్ధస్తూపాలు క్రీస్తుకు పూర్వం మూడవ శతాబ్దంలో నిర్మించబడ్డవి. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఇప్పటి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో మతకలహాల మూలంగా క్రీస్తుకు పూర్వం రెండవ శతాబ్దంలో ఇక్ష్వాకులైన 'కుర్మి'1 కులస్థులు గుంటూరు మండల ప్రాంతానికి వలసవచ్చి స్థిరనివాసమేర్పరచు కొనినట్లున్నది. ఉత్తర భారత దేశం నుండి బయలుదేరిన వీరిలో కొందరు వింధ్య పర్వతాలుదాటిన తర్వాత మహారాష్ట్ర ప్రాంతపు సంస్కృతి-నాగరికతల చేత ఆకర్షింపబడి అక్కడికి వెళ్ళి స్థిరపడినారు. ఈ గుంటూరు మండల ప్రాంతం ప్రముఖంగా కుర్మి వంశస్థులకు ఆలవాలమైనది గనుక 'కూర్మ రాష్ట్రం'గా మొదట పిలువబడి క్రమంగా 'కర్మరాష్ట్రం'-'కమ్మ రాష్ట్ర'మైనది. క్రీస్తుకు పూర్వం మూడవ శతాబ్దం నుండి క్రీస్తుశకం మూడవ శతాబ్దంవరకు శ్రీ ముఖుడు మొదలు మూడవ పులకేశివరకు ముప్పదిమంది శాతవాహనరాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలనచేసి వైదికధర్మం అనుసరించి యజ్ఞయాగాదులు, కర్మకాండ సక్రమంగా నిర్వహించిన ప్రాంతం గనుక 'కర్మరాష్ట్రం'గా ప్రసిద్ధిచెంది, క్రమేణా 'కమ్మ రాష్ట్రం'గా మార్పు చెందింది. 14వ శతాబ్దంలో ఆంధ్రదేశం ముస్లింల పరిపాలన కిందకి వచ్చేంతవరకు కమ్మరాష్ట్రం వుండినది. కనుక క్రీస్తుకు పూర్వంనుండి, ఇక్ష్వాకుల కాలం నుండి కూడ గుంటూరు మండల ప్రాంతం కమ్మరాష్ట్రంగా పేరు పొందినట్లు తెలుస్తుంది.

1 భారత దేశ చరిత్రలో 'స్వర్ణయుగం'గా ప్రసిద్ధి చెందిన గుప్తయుగ మూలపురుషుడు చంద్రగుప్తుడు, బింబిసారుడు, అశోకచక్రవర్తి మొదలగు గుప్తవంశపు రాజులు, చక్రవర్తులు అందరూ 'కుర్మి' కులస్థులెయని తెలుసుకొనవలసింది.
 




Related Novels


ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర

Diviseema Uppena 1977

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.