Home » History » ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర


ఆభరణాన్ని తిసుకొనివచ్చి చక్రవర్తికి అప్పగించారు. ఈ సాహసకార్యాన్ని సాధించిన వారి సంతతివారు 'కమ్మవారని' బిరుదు పొందారు. కొందరు కాపులు ఆభరణాన్ని వెతకడానికి వెళ్ళి అలాగే పోయినారు. వారు వెలమ వారుగా పేరొందినారు. కమ్మవారు, వెలమవారు ఒకేకులంగా ఉన్నప్పుడు స్త్రీలకు మహమ్మదీయులవలె 'గోషా' ఉండేది. ఇది వారి వ్యవసాయపు పనులకు చాలా ఇబ్బంది కలుగజేసింది. అందుమూలమున వారొక సమావేశాన్ని ఏర్పాటుచేసి అందులో స్త్రీల గోషాపద్ధతికి స్వస్తిచెప్పాలని నిర్ణయానికి వచ్చి అందుకు అంగీకరించిన వారందరు తాటియాకు (కమ్మ) మీద నిర్ణయాన్ని వ్రాసి సంతకాలు సేకరించిరి. కమ్మమీద సంతకాలు చేసినవారు 'కమ్మవారు'; సంతకాలు చేయడానికి ఇష్టపడనివారు 'వెలమ' - వెలుపలి (outdoor) వారు అయిరి" అని ఉన్నది.

16. కాకతీయుల కాలంలో కమ్మ - వెలమ కులములు రెండూ మంచి రాజాదరణ కలిగియుండేదివి. క్రీ.శ. 1300 ల సంవత్సరం ప్రాంతమున ఓరుగల్లులో కూడా 'పల్నాటి వీరపురుష' ఆరాధనోత్సవాలు జరుగుచు వచ్చెను. కొన్నికొన్నిచోట్ల వీరులకు గుర్తులు (దేవాలయములు) ఏర్పాటుకబడెను. వీరపూజలు ఎవరి పూర్వీకులకు వారి వంశీకులు జరుపుట సహజం. దీనిని బట్టి పల్నాటి వారికి కాకతీయులకు ఉన్న సంబంధం ఎంత దగ్గరదో తెలియుచున్నది.

కాకతీయులు – కమ్మవారు

17. కాకతీయులు దుర్జయని సంతతివారు. కమ్మవారు, వెలమవారు దుర్జయని సంతతివారని ఎన్నో శాసనాధారాలు ఉన్నవి. కాకతీయులు కమ్మవారితో, చేరులతో, చాళుక్యులతో, హైహయ వంశీయులతో వివాహ సంబంధములు చేసికొన్నారు. కాకతీయ పరిపాలకులలో చాలా ప్రముఖుడైన గణపతిదేవ చక్రవర్తి వెలనాటి (ఇప్పటి రేపల్లె ప్రాంతం) పరిపాలకుడైన పిన్నచోడుని కుమార్తెలు నరామాంబ పేరమాంబలను వివాహమాడెను. వీరు కమ్మవారే. ఇంతేకక పిన్నచోడుని కుమారుడైన జాయప నాయకుని తన గజసైన్యాధ్యక్షునిగా నియమించెను. "జాయప నాయకుడు" సుప్రసిద్ధ 'కమ్మ' కులమున జన్మించి చక్కని రాజనీతి నేతృత్వమును, పాండిత్యమును సమకూర్చించి, తన ధైర్య గాంభీర్యాదుల తో విజృంభించి, శ్శాస్త్ర కంఠలుంబనమున ప్రజ్ఞనగపరచి యనుగ్రహము నాకు పాత్రుడయి నృత్యశాస్త్రమును.




Related Novels


ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర

Diviseema Uppena 1977

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.