Home » History » ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర
అభిలాష కల్గిన బ్రహ్మనాయుడు వీరవైష్ణవ మతాన్ని ప్రచారంచేసి వెనుకబడిన కులాల్ని ఉద్ధరించడానికి ఇప్పటి వనభోజనాలుగా ఆరోజుల్లో 'చాపకూటి' భోజనాలు ఏర్పాటుచేసి వెనుకబడిన కులాల్ని ఉద్ధరించడానికి కృషి చేశారు. ఒక వైపున సనాతనులకు, సంస్కరణవాదులకు; శైవులకు, వైష్ణవులకు తగాదా పరిణమించి చివరికి 1184 సంవత్సరంలో పల్నాటి యుద్ధం జరిగింది.
13. ఈ యుద్ధంలో శైవుడైన మొదటి ప్రతాపరుద్ర చక్రవర్తి వెయ్యి ఏనుగులను నలగామరాజుకు సహాయంగా పంపారు. రెండుపక్కలకు ఎంతో ప్రాణ నష్టం జరిగిన తర్వాత నలగామరాజుకు నామమాత్రమైన విజయం దక్కినది.
14. బ్రహ్మనాయుని అనుసరించి సంఘ సంస్కరణకై వెనుకబడిన కులాల సముద్ధరణ కార్యక్రమాలు, 'చాపకూటి' భోజనాల్లో పాల్గొన్న కమ్మవారిని బ్రహ్మనాయుని అనంతరం సనాతనులైన కమ్మవారు వారి పెండ్లిండ్లకు పేరంటాలకు పిలుచుట మాని, చిన్నచూపు చూడనారంభించిరి. వారు దాదాపు సాంఘిక బహిష్కారం లేక 'వెలికి' గురియైరి. అప్పటివరకు బ్రహ్మనాయుని ప్రోత్సాహ ప్రాపకాలచే ఉన్నత పదవులు గౌరవమర్యాదలు ఎక్కువగాపొంది బ్రహ్మనాయుని తదనంతరం విలువతగ్గిన కమ్మనాయకులు హీనమైన చేటునె కట్టబెట్టడం ఇష్టంలేక వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్ళిరి. అందువలన పల్నాటిసీమలో వెలమకులస్థులసంఖ్య యిప్పుడు బహుస్వల్పం; లెక్కకురానిది. పల్నాటియుద్ధం తర్వాతనే కమ్మ - వెలమ చీలిక ప్రారంభమైనది. బ్రహ్మనాయుని భార్య ఐతాంబ, కోడలు మాంచాల (ఐతాంబ తమ్ముని కూతురు) గారల పుట్టినింటివారి యింటిపేరు 'గండు' వారు కమ్మవారిలో మిగిలిపోగా, బ్రహ్మనాయుని యింటిపేరైన 'రేచర్ల' వెలమ వారికి సంక్రమించింది. అయితే యిప్పటికీ కమ్మవారిలో ప్రముఖ యింటిపేర్లయిన యార్లగడ్డ, కోగంటి వర్గ గోత్రంగా 'రేచర్ల' మిగిలిపోయింది.
15. బ్రహ్మనాయునితో ప్రారంభమైన యీ కమ్మ - వెలమ కులచీలక మొదటి కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో పరిష్కరించబడినదని Edgar Thurston వ్రాసిన (Castes and Tribes of Southern India, Vol III P.96, సం.1909) లో యీ క్రింది గాథ పొందుపరచబడినది: ప్రతాపరుద్ర చక్రవర్తికి సంబంధించిన విలువైన చెవి ఆభరణం (కమ్మ) విరోధుల వశంగాగా కాపుకులానికి చెందిన ఒక మూర ద్రోములను అటకాయించి



