Home » History » ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర


బ్రాహ్మణత్వాన్ని పొందిన కమ్మవారేనని శ్రీ భావయ్య చౌదరిగారి నమ్మిక. దీనికి అనుగుణమైన యీ 19వ శతాబ్దపు మొదటి నాల్గవపాదంలో ఆవిర్భవించిన 'కమ్మబ్రాహ్మణ ఉద్యమం' అందరికి తెలిసించే. ఎందరో ప్రాజ్ఞమతులు కాశి విద్యాపీఠములో చదివి శాస్త్రి, శర్మ, ఆచార్య మొదలైన బిరుదు నామాల్ని ధరించి కర్మ కాండ జరపడం మనం చూశాం.

10. ఇకపోతే దక్షిణ దేశాన్ని ముఖ్యంగా ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాల కులాన్ని గురించి తెలుసుకోవడం ఎంతే అవసరం. ఇందులో చరిత్రమరుగున పెట్టిన విషయాలన్నీ ఇప్పుడిప్పుడే బయల్పడటం మన అదృష్టం.

పల్నాటి వీరులు - పల్నాటి యుద్ధం :

11. పాటలరూపంలో, నాటకాలరూపంలో బుర్రకథ, జముకుల కథలరూపంలో ఆంధ్రదేశంలో బహువిరివిగా ప్రచారంలో ఉన్న పల్నాటి వీరకథను గురించి తెలుసుకుందాం. పల్నాటిని సుమారు 1103 వసంవత్సరంనుండి దాదాపు 13వ శతాబ్దం ఆఖరువరకు హైహయ రాజులు పరిపాలన చేశారు. వారిలో అనుగురాజు, ఆయన కుమారుడు నలగామరాజు ముఖ్యులు, చివరివారు. మహాభారత యుద్ధంవలనే పల్నాటియుద్ధం కూడా రాజ్యంకోసం అన్నదమ్ములమధ్య జరిగిన యుద్ధం కనుక దీనిని 'పల్నాటి భారతం' అన్నారు. ఈ కుటుంబ కలహంలో నలగామరాజు, ఆయన మంత్రిణి నాయకురాలు నాగమ్మ ఒక పక్షంగా, నలగామరాజు తమ్ముడు మలిదేవరాజు, ప్రధానమంత్రి బ్రహ్మనాయుడు మరొక పక్షం ఆదిలో అందరిది ఒకే మతం ఒకే కులం; శైవమతం, కమ్మకులం. నలగామరాజు తండ్రియైన అనుగురాజు నలగామ రాజాది పుత్రులినముండుగురును పుట్టుటకు పూర్వము సంతానము కొరకై పరితపించుచు, తన మంత్రియుగు దొడ్డనాయుని (బ్రహ్మనాయుని తండ్రి) జ్యేష్ఠపుత్రుడగు పెద్దన్నను (బాదనాయుడు బాదరాజు అని నామాంతరములు) దత్తు చేసుకొని పెంచుకొనుచుండెను.

12. ఇటీవలి 1956సంవత్సరము వరకు వేరే మత్సనులను, కులస్తులను, దత్తు తీసుకోవడం ఆచారంగా లేకపోవడం, గుర్తింపబడకపోవడం ద్వారా పై జెప్పిన దత్తస్వీకారం నలగామరాజు, బ్రహ్మనాయుడు ఒకే కులానికి చెందినవారని తెలుపుతుంది. తర్వాత సంఘ సంస్కరణ...




Related Novels


ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర

Diviseema Uppena 1977

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.