Home » History » ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర
నారని వ్రాశారు. సరస్వతి స్వాములవారు కమ్మవారు ప్రాచీన క్షత్రియులని, ఉత్తర దేశానికి చెందిన కుర్మి1, కుంబి2, మరాట్ట రాజవంశీయులని ఆంధ్ర మహారాష్ట్ర ప్రాంతాలలో స్థిరనివాసమేర్పరచుకొనినారని వాక్యానించారు. అంటే పురూరవవంశానికి చెందిన చంద్రవంశపు రాజైన కృత్సమద ఋషికుమారుడైన కూర్మరాజ వంశీయులని, శివాజి చక్రవర్తి, గ్వాలియర్, సతారారాజులు మరియు అయోధ్యరాజులు కుర్మి3 కులానికి చెందినవారేనని, కమ్మవారికి 'చౌదరి' గౌరవనామధియులవుతారని శ్రీ సరస్వతి స్వాములవారు ధృవీకరించినారు. పద్మనాయక చరిత్ర, బొంబాయి గజెటీర్లు కూడా ఈ వాదాన్ని ధృవపరిచాయి. కమ్మచరిత్ర కారులైన శ్రీ. కె. కొత్తభావయ్య చౌదరి గారు మహారాష్ట్రలోని కుర్మి (కున్బి) లు కమ్మవారి పూర్వీకులు కానప్పటికీ, కమ్మవారివలె క్షత్రియ సంజాతులని వ్రాసినారు.
8. 1000వ సంవత్సరానికి చెందిన అమరావతి శాసనంలో క్రీ.శ. 4వ శతాబ్దంలో బౌద్ధ పురోహితులలో 'మహానవకమ్ములు' 'నవకమ్ములు' అని రెండు తెగలుండేవని ఉన్నది. అయితే యివి బౌద్ధ పురోహితులకు ప్రాంతాన్నిబట్టి వచ్చిన నామములై వుండవచ్చని శ్రీ భావయ్య చౌదరి గారు అభిప్రాయపడినారు.
9. కమ్మవారు ఒక కులంగా 10వ శతాబ్దంనుండి ఉన్నట్లు ఆధారాలు ప్రబలంగా ఉన్నాయి. 10వ శతాబ్దానికి చెందిన రెండవ అమ్మరాజ విజయాదిత్యుని కురువాడ శాసనంలోను, 1011వ సంవత్సరపు పశ్చిమ చాళుక్య రాజైన ఐదవ విక్రమాదిత్యుని శాసనంలోను 'కమ్మకులజాలైన వైశ్యులు' అని, అమరావతి శాసనంలో 'కమ్మకులోద్భవులైన బ్రాహ్మణులు', అని ఉన్నవి. ఆపస్తంభ సూత్రములను, కాణ్వపధ బ్రాహ్మణాన్ని అనుసరించి క్షత్రియులు, వైశ్యులు, బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రాహ్మణులు కావచ్చునని ఉన్నది గనుక యీ 'కమ్మకులజాలైన వైశ్యులు' 'కమ్మకులోద్భవులైన బ్రాహ్మణులు' బ్రహ్మజ్ఞానము పొంది...
సూచికలు (Footnotes):
1. కూర్మి కులస్థులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రపు తూర్పు భాగం, బీహారు రాష్ట్రపు పశ్చిమ భాగం కలసిన ప్రాంతంలో యిప్పటికి అధికంగా ఉన్నారు.
2. కుంబి, మహరట్ట, మరాఠాలు మహారాష్ట్రలో ప్రముఖంగా ఉన్నారు.
3. మొదటి పేజీలోని పాదసూచిక కూడా చూడుడు.



