Home » History » ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర


ఈఈశ్వరదత్తుగారి పుస్తకంలో 'కమ్మనాడు' నరసరావుపేట, సత్తెనపల్లి, అద్దంకి, ఒంగోలు, బాపట్ల, చీరాల తాలూకాల ప్రాంతమని, దీనికి పశ్చిమాన శ్రీశైలం, ఉత్తరమున పల్నాడు, వెలనాడు, దక్షిణాన గుండ్లకమ్మ, తూర్పున బంగాళా ఖాతానికి మధ్యనున్న ప్రాంతమని ఎల్లలు చెప్పినారు. అయితే వేర్వేరు కాలములలో యీ ఎల్లలు మార్పు చెందినట్లు ఆధారాలు ఉన్నాయి. కమ్మ రాష్ట్రం, కమ్మనాడులకు సంబంధించి ఆ తర్వాత ఎన్నో శాసనాలు, ఆధారాలు ఉన్నాయి.

ఒక కులంగా కమ్మవారు

5. కమ్మవారు ఒక కులంగా ఎప్పుడు ఆవిర్భవించారు అనడానికి, పౌరాణిక, ఇతిహాసిక, చారిత్రక ఆధారాలెన్నో ఉన్నాయి.

6. W. ఫ్రాన్సిస్ వ్రాసిన 1901 వ సంవత్సరపు చెన్నరాష్ట్రపు జనాభా రిపోర్టులో యీ విధమైన పౌరాణిక ఇతిహాసమున్నది: రాక్షసులచే యజ్ఞయాగాదులకు భంగం కలిగింపబడిన ఋషులు విసిగివేసారి రాక్షసకోరి ముందెట్టుకోగా ఆయన వారిని లక్ష్మీదేవి వద్దకు వెళ్ళమని చెప్పాడని, ఆమె వారికి తన కమ్మలున్న పేటిక నిచ్చి ఒక నూరు సంవత్సరాలు దానిని పూజించమని చెప్పిందని, వారలా నూరు సంవత్సరాలు పూర్తయిన పిమ్మట ఆ పేటికనుంచి 500 ల వీరులు ఉద్భవించారని, ఋషుల కోరికమీద వారు రాక్షస సంహారం చేశారని, తర్వాత వారికి క్షత్రియోచిత మర్యాదలు చేసి క్షత్రియులుగా పరిగణించి పెద్దపెద్ద సారవంతమైన భూఖండాలపై వ్యవసాయపు హక్కు భుక్తులు సంక్రమించచేశారని, అందువలన అమరావతి మొదలైన కృష్ణా మండలం1 (ప్రస్తుతం గుంటూరు మండలం), నెల్లూరు మండలంలోని పెద్దపెద్ద భూఖండాలపై ఆధిపత్యం వహించారని, వారిప్పుడు ఎంతో విజయవంతమైన వ్యవసాయకులని ఉన్నది.

7. ఆంధ్రుల ప్రఖ్యాత చారిత్రకులైన డాక్టర్ చిలుకూరి వీరభద్రరావుగారు కమ్మవారు ఇక్ష్వాకులనుండి, చాళుక్యులనుండి, బుద్ధవర్మ సంతతినుండి, కాకతీయులనుండి ఉద్భవించి...

సూచికలు (Footnotes):

1. అప్పటి మండలం అనగా జిల్లా, ఇప్పుడున్న మండలాలు అప్పటి తాలూకాలకంటే కూడా చాలా చిన్నవి.
 




Related Novels


ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర

Diviseema Uppena 1977

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.