Home » History » ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర
2. కమ్మరాష్ట్రమును గురించి క్రీ.శ. మూడవ శతాబ్దపు ఇక్ష్వాకురాజైన మంధాతృ పుత్ర పురుషదత్తుని బేతవోలు (జగ్గయ్యపేట) శాసనంలో ప్రథమంగా పేర్కొనబడడం జరిగింది. పల్లవ వంశానికి చెందిన బుద్ధవర్మ కుమారుడైన రెండవ కుమార విష్ణు కాలంలో (క్రీ.శ. 650 సంవత్సరపు చందలూరు1 (అద్దంకి తాలూకా, ఒంగోలు జిల్లా2) గ్రామపు మొదటి తామ్ర శాసనంలో 'కర్మాంక రాష్ట్రం'గాను, మరల తూర్పు చాళుక్య వంశానికి చెందిన) మంగి యువరాజు అనే సర్వలోకాశ్రయ మహారాజు కాలం (క్రీ.శ. 673వ సంవత్సరంలో వేయించిన రెండవ చందలూరు తామ్ర శాసనంలో 'శ్రీ సర్వలోకాశ్రయ మహారాజు కమ్మరాష్ట్రే చందలూరుగ్రామే' అని ఉన్నది. కనుక కమ్మకరాష్ట్రము, కర్మ రాష్ట్రము, కర్మాంక రాష్ట్రము, కర్మక రాష్ట్రము, కమ్మక రాష్ట్రము, కమ్మరాష్ట్రము — యివి అన్నీ కూడ వేర్వేరు కాలములలో 'కమ్మరాష్ట్ర' పదనికి రూపాంతరాలని తేటతెల్లమౌతుంది.
3. ఇకపోతే ఏ ప్రాంతాన్ని కమ్మరాష్ట్రమనేవారు? అంటే కృష్ణా నదికి దక్షిణము నుండి నెల్లూరు జిల్లాలోని మన్నేరు నదికి ఉత్తరప్రాంతం వరకు యీ మధ్యలో ఉన్న ప్రదేశమని ఆధారములు తెలుపుతున్నాయి. అంటే ఇప్పటి గుంటూరు జిల్లా మొత్తం, నెల్లూరు జిల్లాలోని దర్శి, పొదిలి, కందుకూరు, కావలి తాలూకాలు వస్తాయి. (ఈ ప్రదేశం 1970లో ప్రకాశం లేక ఒంగోలు జిల్లా ఏర్పాటుకు ముందుది).
4. శ్రీ కృష్ణదేవరాయల కాలంనాటి విజయనగర సామ్రాజ్యం 200 సీమలుగా విభజింపబడి అందు ఆంధ్ర ప్రాంతం 22 సీమలుగా ఉండేది. ఈ కాలంలోనే కమ్మరాష్ట్రానికి ఉత్తర ప్రాంతం 'వెలనాడు'ని దక్షిణ ప్రాంతానికి 'కమ్మనాడు'ని పేర్లు. కమ్మ రాష్ట్రము, కమ్మనాడు ఒకటే కాదని, కమ్మనాడు కమ్మరాష్ట్రంలో ఒకభాగమేనని, కమ్మరాష్ట్రము పెద్దదని, అందులో కమ్మనాడు, వెలనాడు, పలనాడు, పాకనాడు ప్రాంతములు కమ్మరాష్ట్రంలోని భాగాలని తెలుస్తున్నది. ప్రఖ్యాత చారిత్రక-భౌగోళిక శాస్త్రజ్ఞుడైన కుందూరి...
పాటకరింపులు / సూచికలు (Footnotes):
1. చందలూరు కమ్మరాష్ట్రశాసములు చరిత్ర ప్రసిద్ధి చెందినవి. చందలూరు రచయిత స్వగ్రామం.
2. ఒంగోలు లేక ప్రకాశం జిల్లా



