Home » History » ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర


27. మధుర, తంజావూరు నాయక రాజులుగానే కాక కమ్మ ప్రముఖులందరో విజయనగర సామ్రాజ్యంలో పలుప్రాంతములలో స్థానిక సర్దారులుగా, సేనాపతులుగా ప్రాముఖ్యము వహించిరి.

28. మహమ్మదీయుల పాలనాకాలంలో చాలామంది కమ్మవారు జమీందారులుగా జాగీరుదారులుగా గోల్కొండ నవాబుల క్రింద పనిచేసిరి. కర్నూలు జిల్లాలోని దుపాటిసీమ 'సాయపనేని' వారి చేతను, కడప జిల్లాలోని గండికోట పెమ్మసానివారి చేతను పరిపాలింపబడినవి. గుంటూరుజిల్లా కొండవీటి సీమలో 497 గ్రామములు 14 సముతులుగా 14 మంది కమ్మవారైన చౌదరీలు నల్లబోతు, అలపర్తి, దేవభక్తుని, మానం, సూర్యదేవర, వేములపల్లి, కొసరాజు, వడ్లమూడి, వాసిరెడ్డి కుటుంబములవారి ఆధీనములో నుండినవి. కొచ్చెర్లకోట, సర్వేపల్లి సీమలు రావెళ్ళవారి క్రిందను, నెల్లూరుజిల్లాలోని రంపిచర్లకోట మేదరమెట్లవారి క్రిందను, నందిగామ (కృష్ణాజిల్లా), చింతపల్లి (గుంటూరుజిల్లా) ప్రాంతములు వాసిరెడ్డివారి క్రిందను, దేవరకోట (చల్లపల్లి) సంస్థానము యార్లగడ్డ వారి పాలనలోను వుండినవి. విశాఖపట్నం ప్రాంతపు విజయనగర గజపతి రాజుల క్రింద వెలిచేతి, కొమ్మినేని, బొమ్మినేని, మేదరమెట్ల మొదలగు కుటుంబముల కమ్మవారు పెక్కు ఉన్నతాధికారపదవులను నిర్వహించిరి.

29. బ్రిటీష్ పాలనాకాలంలో కూడ పెక్కు కమ్మకుటుంబములవారు జమీందార్లుగా నుండిరి. వారిలో గుంటూరు, కృష్ణాజిల్లాకు చెందిన కొంత ప్రాంతాన్ని పాలించిన శ్రీరాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారు చాలా ప్రసిద్ధి కెక్కినవారు. వీరి ఆధీనములో కృష్ణా - గుంటూరు జిల్లాలకు చెందిన 551గ్రామములు ముందు చింతపల్లి తర్వాత అమరావతి రాజధానులుగా పాలింపబడినవి. ఈయన కాలంలోనే ఒక పెద్ద భవనానికి పునాది తీయుచుండగా ప్రపంచఖ్యాతి గాంచిన అమరావతి బౌద్ధ స్తూపము బయల్పడినది. రాజావాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారు గొప్ప దానశీలురు, వదాన్యుడు. ఆయన 66 గ్రామములలోని భూములను పండితోత్తములైన బ్రాహ్మణులకు అగ్రహారములుగా యిచ్చెను. స్వర్ణతులాభారమునొకసారి, రజతతులాభారములను రెండు పర్యాయములు నిర్వహించి పేదలకు వెండి, బంగారములను పంచిపెట్టెను. 108 దేవాలయముల ముందు ఇత్తడి ధ్వజస్తంభములను వేయించి, గుంటూరు జిల్లాలోని కొన్ని దేవాలయములకు భూములను మాన్యములుగా యిచ్చెను. మంగళగిరి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయముముందు 11 అంతస్తుల.




Related Novels


ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర

Diviseema Uppena 1977

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.