ఇంట్లో దేవుడి విగ్రహాలు ఎంత ఎత్తులో ఉండాలి...
హిందువులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే.. ఇంట్లో ఒక చిన్న ప్రదేశంలో అయినా చిన్న పూజ గదిని ఏర్పరుచుకుంటారు. పూజ గదిలో దేవుడి పటాలు, దేవుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే పూజ గది అందంగా కనిపించాలనే తపనతో ఈ జనరేషన్ వారు దేవుడు విగ్రహాల విషయంలో కొన్నితప్పులు చేస్తున్నారు. ఇంట్లో దేవతల విగ్రహాలు ఉంచుకోవాలి అంటే నియమాలు ఏంటి? దేవుడి విగ్రహాలను ఎంత ఎత్తులో ఉన్నవి ఉంచుకోవచ్చు. తెలుసుకోవడం చాలా ముఖ్యం.
చాలామంది సొంత ఇల్లు కట్టుకునే ముందు దేవుడి గది అందంగా కనిపిస్తే చాలని అనుకుంటారు. దానికి తగినట్టు వివిధ రకాల డిజైన్లు చేయించుకుంటారు. కొందరు దేవుడి గదిలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంచుకునేందుకు వీలుగా పూజా గదిని ఏర్పాటు చేయించుకుంటారు. అయితే దేవుడికి చేసే పూజలు సఫలం కావాలన్నా, దేవుడిని కోరే కోరికలు నెరవేరడాన్నా దేవుడి గదిలో ఉండే విగ్రహాల పరిమాణం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
దేవుడి పూజ గది చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా దేవుడి విగ్రహాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దేవతా మూర్తుల విగ్రహాలు పెద్దగా ఉంటే గది చాలా ఆకర్షణగా ఉంటుందని అనుకుంటారు. కానీ దేవతా విగ్రహాలను మెయింటైన్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఉంచుకోవాలి. ఆర్భాటం కోసం పెద్దవి పెట్టి తరువాత వాటిని శుభ్రం చేసుకోవడం, నిత్య పూజ చేయలేక పోవడం వంటి పరిస్థితి తెచ్చుకోకూడదు.
మట్టి తో చేసిన విగ్రహాలు కొన్ని పూజలో పెడుతుంటారు. అలాంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక లోహంతో చేసిన విగ్రహాలు అయితే పెద్దవి పూజ గదిలో పెట్టుకోకూడదు. బంగారం, వెండి, పంచలోహం వంటి లోహంతో చేసిన విగ్రహాలు ఎప్పటికీ అంగుళం పరిమాణం కంటే పెద్దగా ఉండకూడదు. అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న విగ్రహాలకు చాలా ఆకర్షణ శక్తి ఉంటుందట. ఆ శక్తిని ఇల్లు భరించలేదు. పెద్ద విగ్రహాలకు చేసే పూజ చాలా విశిష్టంగా, ప్రత్యేకంగా ఉండాలి. ఇంట్లో ఎలాంటి ముట్టు, అంటు కలవకుండా ఉండాలి. లేకపోతే అలాంటి విగ్రాహాల ఆరాధన వల్ల కలిగే ప్రయోజనం కంటే నష్టమే అధికంగా ఉంటుందని అంటారు.
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం పూజ గదిలో ఉంచుకునే దేవతల లోహ విగ్రహాలు రెండు అంగుళాల పరిమాణం నుండి 9 అంగుళాల పరిమాణంలోపు మాత్రమే ఉండాలట. అంత కంటే పెద్దగా ఉన్నవి ఎట్టి పరిస్థితులలోనూ దేవుడి పూజ గదిలో ఉంచుకోకూడదు. కొత్త దేవుడి విగ్రహాలను పూజ గదిలో ఉంచుకొనేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ మంచి ముహూర్తం చూసే ప్రతిష్ఠ చేసుకోవాలి. దీని వల్ల ఇంటి మీద ఎలాంటి అశుభ ఫలితాలు ఉండవు.
దేవతల విగ్రహం పూజ చేసే వ్యక్తుల కంటి మట్టం కంటే ఎత్తులో ఉండాలట. ఇలా ఉంటే దేవతల దర్మనం చేసుకోవడానికి ఎలాంటి ఆటంకం ఉండదని అంటారు. కానీ విగ్రహం మరీ ఎత్తైన ప్రదేశంలో ఉండకూడదు. చాలా ఎత్తులో ఉంటే పూజలో ఆటంకాలు, సమస్యలు ఏర్పడతాయి.
ఇంటి ప్రధాన దేవత విగ్రహాన్ని ఎప్పుడూ ఎత్తైన ప్రదేశంలో మధ్యలో ఉంచాలి. దీని వల్ల ఇంటి దేవుడు ప్రసన్నం అవుతాడు. ఎప్పుడూ తన ఆశీర్వాదం ఆ కుంటుంబం మీద ఉండేలా చూస్తాడు.వాస్తు ప్రకారం దేవుడి గదిలో విగ్రహాల ఎత్తు ఇంటి పరిమాణానికి, ప్రదేశానికి అనుకూలంగ ఉండాలి. అలా ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది.
*రూపశ్రీ