సోమవతి అమావాస్య రోజు ఇలా దీపాలు వెలిగించండి..!
హిందూ మతంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని తిథులు మరింత ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథులు కొన్ని ప్రత్యేక పనులకు మంచివిగా పేర్కొనబడతాయి. పౌర్ణమి రోజు పూజలు, అపవాసాలు, శక్తి ఆరాధన వంటి దైవిక కార్యాలు చేస్తే.. అమావాస్య రోజు చనిపోయిన పెద్దలకు తర్పణాలు వదలడం, దానాలు చేయడం, పిండప్రదానం చేయడం వంటివి చేస్తారు. దీనివల్ల జీవితంలో చాలా మార్పులు, పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతారు. ఈ ఏడాది 30 వ తేదీన అమావాస్య తిథి ఉంది. మార్గశిర మాస కృష్ణపక్షంలో వస్తున్న ఈ అమావాస్య రోజు వస్తుంది. అందుకే దీనికి సోమవతి అమావాస్య అని పేరు. ఈ రోజు వెలిగించే దీపాల వల్ల దేవతలు, మరణించిన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందట.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించి. ఆ ప్రధాన ద్వారం వద్ద నీటితో నింపిన కలశం కూడా ఉంచాలి.
సోమవతి అమావాస్య రోజు దక్షిణ దిక్కులో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో మరణించిన పెద్దలను సంతృప్తి చెందుతారట. కుటుంబ సభ్యులందరికి పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని చెబుతారు.
రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం శ్రేష్టమని, అది ఎంతో పుణ్యఫలమని చెబుతారు. రావి చెట్టు మీద మహా విష్ణువు నివాసం ఉంటాడని చెబుతారు. అందుకే రావి చెట్టు దగ్గర దీపం పెడితే విష్ణువు అనుగ్రహం ఉంటుంది. అంతే కాదు.. ఇలా చేస్తే పితృ దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుందట.
సోమవతి అమావాస్య రోజు ఇంటి ఈశాన్య మూలలో దీపం వెలిగించడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల దేవతల అనుగ్రహం ఉంటుంది.
*రూపశ్రీ.