వాతాపి గణపతి చరిత్ర..!

కర్ణాటకలో బాదామి అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం ఒకప్పుడు చాళుక్యులు అనే రాజవంశపు ఏలుబడిలో ఉండేది. బాదామిని రాజధానిగా ఏర్పాటు చేసుకుని పాలించారు కాబట్టి, వీరికి బాదామి చాళుక్యులు అన్న పేరూ ఉంది. ఈ చాళుక్యులకీ, పల్లవులకీ నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకసారి వారిది పైచేయి అయితే ఒకోసారి వీరిది పైచేయిగా ఉండేది. అలాంటి ఒక పోరులో పల్లవులది పైచేయి అయ్యింది. ఆ విజయానికి చిహ్నంగా వారు బాదామిలో ఉన్న గణపతిని తీసుకువెళ్లి తిరువారూర్‌ జిల్లాలోని ‘తిరుచెన్‌కట్టంకుడి’ అనే ప్రాంతంలో ప్రతిష్టించారు. బాదామికి పూర్వం వాతాపి అన్న పేరు ఉంది కాబట్టి ఆ గణపతిని వాతాపి గణపతి అని కొలుచుకునేవారు. ఇంకా మరిన్ని విశేష్లాల కోసం ఈ వీడియోను చూడండి... https://www.youtube.com/watch?v=Qy6XmXI0y2Q

 

 


More Punya Kshetralu