తిరుమలకు మొదటిసారి నడవాలి అని అనుకునేవారికి కొన్ని

సలహాలు:

 

 Information about give me some tips on Tirupati to Tirumala on Foot . every time a new experience Tirumala Tirupati Devastanams

 

 

నెమ్మదిగా నడవండి, పరుగెత్తవద్దు, పరుగెత్తితే తొందరగా అలసిపోతారు. సాధ్యమైనంతవరకూ మొదటి గంట ఎక్కడా కూర్చోవద్దు, కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటి గంటలో మెట్లన్నీ అయిపోయి మామూలు రోడ్డులాంటి దారికి వెళ్తారు, ఇక అక్కడి నుండి మోకాళ్ళ మంటపము వరకూ మెట్లు ఉండవు, ఉన్నా ఒకటీ అరా ఉంటాయి. మెట్లకి ఇరువైపులా ఉన్న అంగళ్లలో పానీయాలు, తినుబండారాలు తక్కువ తీసుకోండి. సాధ్యమైనంతవరకు గ్లూకోసు, నీళ్లు - వీటిపై ఆధారపడండి, ముఖ్యంగా కూల్ డ్రింకులు(కోక్,పెప్సీ మొ.) ఏ విధంగానూ మన నడకకు సహకరించవు. నామాల కొండ వద్ద తొందరగా దైవదర్శనం అయ్యేందుకు ఇస్తున్న రశీదు తీసుకోవడం మరచిపోవద్దు. ఆ తరువాత కొంత దూరం నడిచినాక మళ్ళీ ఆ రశీదు మీద ముద్ర వేయించుకోవడం మరచిపోవద్దు. లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోండి, లగేజిని కింద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఉచిత రవాణా సేవలో పైకి పంపించండి.

శ్రీవారి మెట్టు కాలిబాట:

 

 Information about give me some tips on Tirupati to Tirumala on Foot . every time a new experience Tirumala Tirupati Devastanams

 

తిరుమల చేరుకోవడానికి ఇది రెండవ కాలిబాట. తిరుమల పట్టణానికి కళ్యాణీ డ్యాము నీటి సరఫరాకి ఈ మార్గం నుండి పైపులైను వేసిన తరువాత నుండి ఈ దారి కొంత అభివృద్ధి చెందింది. అలాగే తితిదే వారు ఈ కాలిబాటను కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికీ, అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే ఈ కాలిబాటలో సమస్య ఏమిటంటే దీనికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండేవి.కాని తిరుమల తిరుపతి దేవస్తానము వారు తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు దారి వరకు ఉచిత బస్సులను నడుపుతున్నారు.ఈ దారిలొ వేళ్ళేవారికి తిరుమల తిరుపతి దేవస్తానం వారు దివ్యదర్శనానికి టోకను మంజూరు చేస్తున్నారు,దారి పొడవునా నీటి కుళాయిలను వుంచారు,అలిపిరి లాగా మెట్టు దారి లాగా పైకప్పును కూడా యేర్పాటుచేసారు. ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు అగస్త్యాశ్రమం లో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటోలో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది.


More Venkateswara Swamy