దేవుడు మనతో ఉన్నాడని చెప్పడానికి సంకేతాలు ఇవే..!
నాస్తికులు అయినా సరే.. ఈ ప్రపంచం ఓ గొప్ప శక్తి సహాయంతో నడుస్తోందని, దానికి సైన్స్ లో ఏదో ఒక పేరు పెట్టి తృప్తి పడతారు. ఇక భారతీయులు ఎక్కువగా దైవాన్ని నమ్మేవారు ఈ సృష్టిని నడిపిస్తున్నది దేవుడే అని నమ్ముతారు. జీవితంలో తీరక లేకుండా తలమునకలై ఉన్నప్పుడు దేవుడి గురించి తలచుకునే పరిస్థితి కూడా రాదు. కానీ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, ఎదైనా బాధ కలిగినప్పుడు నువ్వు ఉన్నావా? ఎందుకు ఇలా కష్టాలు ఇస్తున్నావు అంటూ దేవుడిని నిందిస్తుంటారు. అయితే పరిస్థితి ఏదైనా సరే.. దేవుడు మనతో ఉన్నాడని, మన వెంట ఉంటున్నాడని చెప్పడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. అవేంటో తెలుసుకుంటే..
బ్రహ్మ ముహూర్తం..
బ్రహ్మ ముహూర్తంలో ఎవరి ప్రమేయం లేకుండా మెలకువ వస్తుంటే దేవుడు మీతో ఉన్నట్టేనట. అయితే ఇలా ఉదయాన్నేలేవడం అనేది అలవాటు కూడా కావచ్చు. కానీ చాలా వరకు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం, స్నానం, దైవారాధన మొదలైనవి చేయడం వల్ల దైవం ఎప్పుడూ వెన్నంటి ఉంటాడు.
సంతోషం..
జీవితంలో సంతోషం ఉండాలని కోరుకునే వారు ఎక్కువ. ఇంకా చెప్పాలంటే కష్టాలు రాకూడదని, ఎప్పుడూ సంతోషమే తమకు కావాలని అనుకుంటారు. అయితే ఎలాంటి కారణం లేకుండా కొన్నిసార్లు సంతోషం వేస్తుంటుంది. అంటే.. సంతోషంగా ఉండటానికి కారణం అక్కర్లేద.. ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటేనే ఇలా సంతోషంగా ఉండగలం.
విజయం..
ఏదైనా ఒక పని చేయడానికి తలపెట్టినప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆ పనిని పూర్తీ చేయగలిగితే దేవుడి ఆశీర్వాదం మీకున్నట్టే. దేవుడి అనుగ్రహం లేనిది ఏ పని పూర్తవ్వదు.
మంత్రం..
కొందరు ఏదైనా పని చేస్తున్నా, నిశ్శబ్దంగా ఉన్నా, వేరే ఆలోచనలలో ఉన్నా.. వారిలో అంతర్లీనంగా ఏదో ఒక మంత్రం చదువుతున్నట్టు వారికి అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి ఓం అనే ప్రణవనాదం వినబడినట్టు అనిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా కలలో దేవుడు కనిపించడం, దేవుడి మంత్రాలు, శ్లోకాలు చదువుతున్నట్టు అనిపించడం మొదలైనవి కూడా దేవుడి ఆశీర్వాదం ఉన్నవారికే జరుగుతాయి.
ఆర్థిక స్థితి..
జీవితంలో దేవుడి అనుగ్రహం ఉంటే ఆర్థిక పరిస్థితి దానికదే కుదుటపడుతుంది. ఆర్థిక సమస్యలు మెల్లగా మాయమవుతాయి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ అవే సర్థుకుంటాయి. కొత్త అవకాశాలు వస్తాయి. తినడానికి, జీవితం గడవడానికి ఎలాంటి లోటు ఉండదు. ఇవన్నీ జరిగితే మాత్రం దేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ వెంట ఉందని అర్థం.
*రూపశ్రీ.
