కాల భైరవుడి శక్తులు ఏంటో తెలుసా!


హిందూ ధర్మంలో చాలా రకాల దేవతలు ఉన్నారు.  ముక్కోటి దేవతలు అని అంటుంటారు కూడా. వీరిలో కాల భైరవుడు కూడా ఒకరు. కాల భైరవుడు శివుడి అంశ అని చెబుతారు.  శివుడి రుద్ర అవతారంగా కాల భైరవుడిని భావిస్తారు.  హిందూ ధర్మంలో ఉన్న ఎంతో మంది దేవతలకు ఆలయాలున్నట్టు, వారికి పూజలు జరిగినట్టు కాలభైరవుడికి పూజలు జరగవు. అయితే కాల భైరవుడి పూజ కోసం ప్రత్యేక రోజు ఉంది.  అదే కాలాష్టమి.  కాలష్టమి రోజు కాల భైరవుడిని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుందని అంటారు. అయితే అసలు కాల భైరవుడికి ఉండే శక్తులు ఏంటి ? తెలుసుకుంటే..

కాల భైరవుడు కాలాన్ని అంటే సమయాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఉంటాడట. ఒక వ్యక్తి జీవితం.  ఆ వ్యక్తి జీవన చక్రం మొదలైనవి అన్నీ కాల భైరవుడి నియంత్రణలో ఉంటాయని అంటున్నారు. ఈ భూమి పై ఎవరు ఎంత కాలం జీవించాలి,  ఎప్పుడు మరణించాలి అనేవి కాల భైరవుడు నిర్ణయిస్తాడట.

కాల భైరవుడిని ఆరాధిస్తే భూత ప్రేత పిశాచ బాధ తప్పుతుందట. దుష్ట శక్తులు, ప్రతికూల శక్తుల నుండి విముక్తి లభిస్తుందట.

పాపాలు నశించాలంటే కాల భైరవ పూజ సరైన మార్గం.  కాల భైరవుడి ఆశీర్వాదం ఉంటే జీవితంలో చాలా సానుకూల శక్తి పోగవుతుంది.  తెలిసీ తెలియక చేసుకున్న పాపాలు పశ్చాత్తాపంతో కాల భైరవుడి ముందు మోకరిల్లడం ద్వారా నశిస్తాయి. ముఖ్యంగా జీవితంల ఏర్పడే సమస్యల నుండి ఉపశమనం లభించడంలో కూడా కాల భైరవుడి ఆశీర్వాదం లభిస్తుంది. అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి.

కాల భైరవుడిని ఆరాధించే వారికి మోక్షం లభిస్తుంది.  వారణాసి లేదా కాశీ లో కాలబైరవ దేవాలయం ఉంటుంది. ఇక్కడ కాల భైరవ దేవాలయాన్ని దర్మించినా మోక్షం లభిస్తుందని చెబుతారు.


                                   *రూపశ్రీ.
 


More Mysteries - Miracles