ఆదివారం రోజు ఈ పరిహారాలు పాటిస్తే కష్టాల నుండి గట్టెక్కుతారట..!
కష్టం మనిషిని చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది. కొందరికి కష్టాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతాయి. మరికొందరికి మాత్రం కష్టాలు దీర్ఘకాలం ఉంటాయి. ఇంకొందరికి ఒకటి తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. అయితే కష్టాలు ఎదురైనప్పుడు చాలామంది దేవుడిని నమ్ముకుంటారు. దేవుడిని నమ్మి కొన్ని పనులు చెయ్యడం వల్ల కష్టాల నుండి గట్టెక్కుతామని అనుకుంటారు. అందుకే బాధలు, కష్టాలలో ఉన్నప్పుడు చాలామంది పరిహారాలు పాటిస్తారు. దీని వల్ల మానసిక ఊరట లభించడంతో పాటూ.. కష్టాల నుండి మనసు పాజిటివ్ వైపు మళ్లుతుంది. ఆదివారం రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే కష్టాల నుండి గట్టెక్కవచ్చట.
ఆదివారం..
ఆదివారం సూర్య భగవానుడికి చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. సూర్యభగవానుడికి కొన్నిపరిహారాలు పాటిస్తే కష్టాల నుండి గట్టెక్కవచ్చు.
అర్ఘ్యం..
ఆదివారం ఉదయం స్నానం చేసి తూర్పు వైపు తిరిగి నీటిని అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యాన్ని సాధారణంగా అయినా సమర్పించవచ్చు లేదా.. నదీ ప్రాంతంలో, సముద్రం.. నీరు పారే ప్రాంతంలో అయినా సమర్పించవచ్చు. ఇలా చేయడం చాలా మంచిది. అర్ఘ్యం సమర్పించేటప్పుడు "ఓం సూర్యాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఆదిత్యాయ నమః" అనే మంత్రాలు జపించాలి.
దానం..
ఆదివారం రోజు పేదవారికి బెల్లం, పాలు, బియ్యం, ఎరుపు రంగు వస్త్రాలు, రాగి పాత్రలు దానం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో గ్రహాల స్థానం సక్రమంగా మారడం మొదలవుతుంది.
దీపం..
ఆదివారం రోజు ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో ఉన్న చెడు శక్తి తొలగిపోతుంది. దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించవు.
తిలకం..
ఆదివారం పూజ చేసిన తరువాత చందన తిలకాన్ని నుదుటన ధరించాలి. ఇలా చేయడం వల్ల పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. శాస్త్రీయంగా చూస్తే చందన తిలకాన్ని నుదుటన ధరిస్తే జ్ఞానచక్రం చైతన్యం అవుతుంది. ఇది పాజిటివ్ ఆలోచనలు పెంచుతుంది.
*రూపశ్రీ.