గణేష్ రుద్రాక్ష గురించి తెలుసా...దీన్ని ఉపయోగించడానికి నియమాలేంటంటే..!

 

విఘ్నాలను తొలగించే వాడు వినాయకుడు. ఒక వ్యక్తి జీవితంల సానుకూల శక్తిని చేకూర్చేవాడు,  తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగేలా చేసేవాడు వినాయకుడు.  ఈయన గణాలకు అధిపతి కనుక తలపెట్టే ప్రతి కార్యంలోనూ తొలిపూజ అందుకుంటాడు. వినాయకుడికి చిహ్నంగా గణేష్ రుద్రాక్షను పేర్కొంటారు. గణేష్ రుద్రాక్ష వినాయకుడి తలపై ఉండే త్రిపుండాన్ని,  తొండం ఆకారాన్ని పోలి ఉటుంది.  ఈ రుద్రాక్ష ధరిస్తే జరిగేదేంటి?  దీన్ని ధరించడానికి నియామాలు ఏంటి?  తెలుసుకుంటే..

గణేష్ రుద్రాక్ష..

గణేష్ రుద్రాక్ష అడ్డంకులను నాశనం చేసే శక్తివంతమైన రుద్రాక్ష. ఇది వినాయకుడికి చిహ్నంగా పేర్కొనబడుతుంది. దీన్ని ధరించడం వల్ల జీవితంలో అడ్డంకులు, సమస్యలు తీరిపోతాయట.  ఈ రుద్రాక్ష వ్యక్తికి మానసిక ప్రశాంతతను కూడా చేకూరుస్తుందట.


గణేష్ రుద్రాక్ష ధరిస్తే కలిగే ప్రయోజనాలు..

గణేష్ రుద్రాక్షను ధరించడం వల్ల జ్ఞాపకశక్తి,  ఏకాగ్రత మెరుగవుతాయట.  విద్యార్థులకు,  పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందట.

ఒక వ్యక్తి జీవితంలో సంపద, శ్రేయస్సు, అదృష్టం మొదలైన వాటిని తీసుకుని రావడానికి గణేష్ రుద్రాక్ష సహాయపడుతుందని  నమ్ముతారు. వ్యాపారస్తులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు దీనిని ధరించడం వల్ల సమస్యలు తొలగుతాయట.

కుటుంబంలో సంబంధాలను ఆరోగ్యకరంగా మార్చడంలో గణేష్ రుద్రాక్ష చాలా సహాయపడుతుందని అంటున్నారు.  ముఖ్యంగా వైవాహిక జీవితంలో సామరస్యాన్ని నెలకొల్పడంలో గణేష్ రుద్రాక్ష ప్రభావవంతంగా ఉంటుంది.

గణేష్ రుద్రాక్ష ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో సానుకూల శక్తి వస్తుందట.  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  ప్రతికూల ఆలోచనలు,  ప్రతికూల శక్తిని తొలగించడంలో సహాయపడుతుంది.

ఎవరు ధరించాలి?

విద్యార్ధులు: చదువులో ఏకాగ్రత లేని వారికి లేదా జ్ఞాపకశక్తి బలహీనంగా ఉన్నవారికి ఈ రుద్రాక్ష చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

వ్యాపారులు,  ఉద్యోగస్తులు: వ్యాపారం,  వృత్తిలో పురోగతి కోసం గణేష్ రుద్రాక్షను ధరించాలి.

మనశ్శాంతి కోరుకునే వారు: మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు దీనిని ధరించడం ద్వారా  జీవితంలో శాంతి,  సమతుల్యతను పొందవచ్చు.

మతపరమైన అభ్యాసకులు: సాధకులు, యోగులు,  ధ్యానం చేసేవారు ఈ రుద్రాక్షను ధరించడం ద్వారా  ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు.

కుటుంబం,  వైవాహిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు: కుటుంబ జీవితంలో సామరస్యాన్ని నెలకొల్పడంలో,  సంబంధాలను మెరుగుపరచడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

నియమాలు..

గణేశుని మంత్రమైన "ఓం గం గణపతయే నమః" ను 108 సార్లు జపించడం ద్వారా సోమవారం లేదా బుధవారం ఈ రుద్రాక్షను  ధరించాలి.
రుద్రాక్ష ధరించే ముందు గంగాజలంతో శుద్ధి చేయాలి.
ఇది వెండి, బంగారం లేదా ఎరుపు దారంలో  ధరించాలి.
గణేష రుద్రాక్ష ధరించేటప్పుడు  స్వచ్ఛమైన,  సానుకూల ఆలోచనలతో మాత్రమే ధరించాలి.
రుద్రాక్షను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.  గణేశుడిని నిత్యం పూజించాలి.

                                      *రూపశ్రీ.
 


More Aacharalu