శ్రీశైల బ్రహ్మోత్సవాలు
కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 10 నుంచి నుంచి 21వ తేదీ వరకూ మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 11 రోజుల పాటు అంగరంగవైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, వాహన సేవలు, మహారుద్రాభిషేకం జరుగుతాయి. ఫిబ్రవరి 10న 9.15 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, చండీశ్వరి పూజ జరుగుతాయి. ఫిబ్రవరి 21 వరకు వరకు నిత్యహోమ బలిహరణలు, అర్చనలు కొనసాగిస్తారు. మహాశివరాత్రి రోజు 10.30 గంటలకు రుద్రాభిషేకం, పాగాలంకరణ, అర్ధరాత్రి 12 గంటలకు శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలంలో స్పర్శ దర్శనాన్ని రద్దు చేశారు.