శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం
ఈ దివ్య స్తోత్రాన్ని స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు అందరూ చదవాలి. ప్రతిరోజూ 18 సార్లు వరుసగా చదివి కర్పూర హారతి ఇస్తే శ్రీ వారి దివ్య మంగళమూర్తి దర్శనమవుతుంది.
ఓం శిరసివజ్ర కిరీటం - వదనే శశివర్ణ ప్రకాశం
ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం - కర్ణే వజ్ర కుండల శోభితం
నాసికాయాం సువాసిక పుష్పాదళం - నయనే శశిమండల ప్రకాశం
కంఠేసువర్ణపుష్ప మాలాలంకృతం - హృదయే శ్రీనివాస మందిరం
కరే కరుణాభయసాగరం భుజేశంఖ చక్రగదాధరం
స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం - సర్వాంగే స్వర్ణపీతాంబరం ధరం
పాదే పరమానందరూపం - సర్వపాపనివారకం
సర్వం స్వర్ణమయం - నామ పావనం శ్రీ వేంకటేశం
శ్రీనివాసం - తిరుమలేశం - నమామి శ్రీ వేంకటేశం !!