శ్రీసాయిసచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుటం జరిగినది. ఎందుకనగా అందులోని యితివృత్తము కూడ ఇదియే అవటం వలన ఇలా చేసితిరి.  సచ్చరిత్రలోని 51వ అధ్యయాన్ని 50వ అధ్యాయముగా పరిగణించవలెను.

ాబా

శ్రీసాయిసచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుటం జరిగినది. ఎందుకనగా అందులోని యితివృత్తము కూడ ఇదియే అవటం వలన ఇలా చేసితిరి.  సచ్చరిత్రలోని 51వ అధ్యయాన్ని 50వ అధ్యాయముగా పరిగణించవలెను.

మనకు సర్వశక్తులు, జయము కలుగచేయు సద్గురువులు సాయి..  మేఘాలు వర్షాన్నికురిపించి చల్లదనాన్ని ఇచ్చినట్లు, వసంతములో పువ్వులు వికసించి దేవుని పూజకు వీలు కలుగచేయునట్లు, బాబా కథలు మనకు ఊరట కలుగచేయును. సుఖశాంతులను ఇచ్చును. సాయి కథలు విన్నా, చెప్పినా, చదివినా ధన్యత చెందుదురు. 


కాకాసాహెబు దీక్షీత్ (1864-1926)


ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రహ్మణ కుటుంబములో హారిసీతరామ్ ఉరుఫ్ కాకాసాహెబ్ దీక్షీత్ జన్మించెను. ప్రాథమిక విద్యను ఖండ్వా, హింగన్‍ఘాట్‍లలో పూర్తి చేసెను. నాగపూరులో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడ ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీ కొలువులో చేరెను. ఆ తర్వాత  సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను.


1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్‍కు తెలియదు.  ఆ తర్వాత ఆయన బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లొనావాలాలో ఉండగా, తన పాత స్నేహితుడగు నానాసాహెబు చాందోర్కర్‍ను జూచెను. ఇద్దరు కలసి ఏవో విషయాలు మాట్లాడుకొనిరి. కాకాసాహెబు తాను లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలుజారి పడిన అపాయము గూర్చి చెప్పెను. ఎన్నో  ఔషదములు ఆ బాధను నయము చేయలేక పోయెను. కాలి నొప్పి, కుంటితనము పోవలెనన్న సద్గురువుగు సాయిబాబా వద్దకు వెళ్లమని కాకాకు, నానాసాహెబు సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతము విశదపరచెను. సాయిబాబా "నా భక్తుని సప్తసముద్రముల మీద నుంచి కూడ పిచ్చక కాలికి దారము కట్టి యీడ్చినట్లు లాగుకొనివచ్చెదను.  ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే నాకర్షింపబడడని వాడు అయితే తన దర్శనమే చేయలేడు" అని బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. 

 

ఇదంత విని కాకాసాహెబు సంతసించి "సాయిబాబా వద్దకుపోయి, వారిని దర్శించి కాలుకున్న కుంటితనము కంటే మనస్సు కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును ప్రసాదించమని వేడుకుంటా" నని నానాసాహెబుతో చెప్పెను.


కొంతకాలానికి  కాకాసాహెబు అహమద్‌నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్‍లో వోట్లకై సర్దార్ కాకాసాహెబు మిరీకర్ యింటిలో దిగెను. కాకాసాహెబు మిరీకర్ కొడుకు బాలాసాహెబు మిరీకర్. వీరు కోపర్‌గాంకు మామలతదారు. అదే సమయంలో వీరు కూడ గుఱ్ఱపు ప్రదర్శన నిమిత్తం  అహమద్‌నగరు వచ్చి వున్నారు. ఎలక్షను పూర్తియైన పిమ్మట కాకాసాహెబు శిరిడీకి పోవాలనుకొనెను. మిరీకర్ తండ్రీ కొడుకులు వీరిని ఎవరివెంట షిరిడీకి పంపవలెనా అని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని అహ్వానించుటకు సిద్దపడుచుండెను. అహమద్‍నగరులోనున్న శ్యామా మామగారు తన భార్య అరోగ్యము బాగాలేదనియు, శ్యామాను తన భార్యతో గూడ రావలసినదనియు టెలిగ్రామ్ యిచ్చిరి. బాబా ఆజ్ఞ తీసుకొని శ్యామా అహమద్‍నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగా నున్నదని తెలిసికొనెను. మార్గములొ గుఱ్ఱపు ప్రదర్శనమునకు బోవుచున్న నానాసాహెబు పాన్సే, అప్పాసాహెబు గద్రే శ్యామాను కలసి మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబు దీక్షితుని కలసి, వారిని షిరిడీకి తీసికొని వెళ్ళుమనిరి. కాకాసాహెబు దీక్షీతుకు మిరీకరులకు శ్యామా అహమద్‍నగరు వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామా మిరీకరుల వద్దకు పోయెను. 

వారు శ్యామాకు కాకాసాహెబు దిక్షిత్ ను పరిచయము చేసిరి.  ఆనాటి రాత్రి 10 గంటల రైలులో శ్యామా కాకాసాహెబు దీక్షిత్‍తో కోపర్‍గాం పొవలెనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాలా సాహెబు బాబా పెద్దపటము మీద తెరను తీసి దానిని కాకాసాహెబు దీక్షీతుకు చూపెను. కాకాసాహెబు షిరిడీకి పోయి ఎవరినయితే దర్శించవలెనని నిశ్చయించుకొనెనో వారే పటము రూపముగా అక్కడ తనను ఆశీర్వదించుటకు సిద్ధముగా నున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలింది. దానికింకొక అద్దము వేయుటకు మిరీకరుల వద్దకు బంపెను. చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబు శ్యామాల ద్వారా శిరిడీకి పంపుటకు నిశ్చయించిరి.

 


10 గంటలకు లోపల స్టేషనకు పోయి టిక్కెట్లు కొనిరి. బండిలో సెకండు క్లాసు క్రికిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్టుక్లాసులో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కొపర్‍గాం దిగిరి. బండి దిగగానే షిరిడీకి పొవుటకు సిద్ధముగా నున్న నానాసాహెబు చాందోర్కరును జూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబు, నానాసాహెబు కౌగలించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసి, షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా, కాకాసాహెబు మనస్సు కరిగెను. కండ్లు అనందబాష్పములతో నిండెను. అతడానందముచే పొంగిపొరలుచుండెను. బాబా కూడ వారి కోరిక  కనిపెట్టుకొని యున్నట్లు, వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాను పంపినట్లు తెలియజేసెను.


పిమ్మట కాకాసాహెబు బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడపెను. షిరిడీలో ఒక వాడను కట్టి దానినే తన నివాసస్థలముగా జేసికొనెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవాలకు లెక్కలేదు.  ఈ కథను ఒక విషయముతో ముగించుచున్నాము. బాబా కాకాసాహెబుతో " అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకపోయెదను" అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము జూలై 5వ తేదిన అతడు హేమడ్‌పంతులో రైలులో ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు, సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమడ్‍పంతు భుజముపై వాల్చి ఏ బాధా, చికాకు లేకుండా ప్రాణములు విడిచెను.

 


More Saibaba