ముంబై లోని శ్రీ మహాలక్ష్మి ఆలయం విశేషాలు
ఈరోజు శ్రవణ మాసం మూడవశు క్రవారం . ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి ఆలయం గురించిన కొన్ని వివరాలు. ముంబాయి నగరం లో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం మహాలక్ష్మి ప్రాంతంలోని భూలభాయ్ దేశాయ్ రోడ్డు లో నెలకొని వుంది. మూల విరాట్టు మహాలక్ష్మి దేవి. ఈ ఆలయం 1831లో ధాక్జి దాదాజీ (1760 - 1846) ఒక ప్రముఖ వ్యాపారవేత్త నిర్మించారు. ఈ విశాలమైన ఆలయం ప్రాంగణంలో మహాకాళి,మహాలక్ష్మి, మహాసరస్వతి ఆలయాలు వున్నాయి. దేవి తత్త్వం పరబ్రహ్మ స్వరూపం ఆది శక్తి ఈ దెవి. పరాశక్తి మహా మాయా శక్తి స్వరూపిణి మహాలక్ష్మి మాత. ఈ విశ్వ సృష్టి అంతా ప్రక్రుతి, పురుషుల సంగమం. పురుషుడు అంటే పరబ్రహ్మ స్వరూపం , ప్రక్రుతి అంటే నేచర్. మూడు గుణాలు కలిగి వున్నది ప్రకృతి. అవి సాత్విక, రాజస్ , తామసిక్ . ఇక్కడ వున్న ఈ మూడు మూర్తులు ఈ త్రిగునాత్మక లకి ప్రతీకలు. శ్రీ సరస్వతి సాత్విక గుణానికి, శ్రీ మహాలక్ష్మి రజస్సు కి , శ్రీ మహాకాళి తామస గుణానికి ప్రతిబింబాలని సంఖ్యా శాస్త్రం లో చెబుతుంది. అన్నిటికి మించిన ఆ మాహా శక్తి మహా మాయ, ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ ఆ అది పరా శక్తి రూపిణి మహాలక్ష్మి గా ఇక్కడ రూపు దిద్దుకుంది అని భక్తుల విశ్వాసం. కోరిన కోర్కెలు తీర్చే మాత ఈ మహాలక్ష్మి దేవి.
నిత్యమూ భక్తులతో కిటకిట లాడే ఈ ఆలయం మహిమ గలదని భక్తుల విశ్వాసం. నవరాత్రులలో దేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులను ముగ్గురు దేవతలకు మూడు రోజుల చొప్పున ప్రత్యెక పూజలు నిర్వహిస్తారు. మొదటి మూడు రోజులు మహా కాళికి, తరువాతి మూడు రోజులు మహాలక్ష్మి దేవికి, చివరి మూడు రోజులు మహా సరస్వతికి విశేష పూజలు జరుగుతాయి. దూర ప్రదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అమ్మవారికి పూలు పళ్ళు, స్వీట్స్ సమర్పించు కుంటారు. ముంబై లోని మహాలక్ష్మి రైల్వే స్టేషన్ కి సమీపం లో ఒక కిలోమీటరు దూరం లో వుంది ఈ ఆలయం .....
- Mani Kopalle