శని ప్రదోష వ్రతం.. సాయంత్రం 6 గంటల తర్వాత ఇలా చేయండి.. విజయాలు మీ వెంట వస్తాయి..!
సనాతన ధర్మంలో ప్రదోష వ్రతం రోజు శిుపార్వతులను ఆరాధించడం చాలా పవిత్రంగా పరిగణిస్తారు. శివుడు, పార్వతి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే ప్రదోష వ్రతం రోజున శివలింగానికి కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడట. జీవితంలో ఏర్పడిన కష్టాలు తొలగిపోతాడట. ఇలా ప్రదోష వ్రత సమయంలో పూజ చేయడం మొదలుపెడితే జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుందని, విజయాలు అవే వెంట వస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా శనివారం రోజు చేసే ప్రదోష వ్రతానికి శని ప్రదోషవ్రతం అని పేరు. డిసెంబర్ నెలలో 28 వతేదీ శని ప్రదోషవ్రతం గా పరిగణిస్తారు. శనివారం రోజు ఏం చేయాలంటే..
పంచాంగం ప్రకారం కృష్ణపక్షంలో త్రయోదశి తిథిని శనిత్రయోదశిగా జరుపుకుంటారు. శనివారం ప్రదోష కాలంలో శివుడిని ఆరాధించాలి. ఈ సమయంలో శివలింగానికి నీరు సమర్పించాలి. ఈ సమయంలో పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నుడు అవుతాడు.
ప్రదోష వ్రతం రోజున శివలింగానికి కుంకుమ సమర్పిస్తే చాలా శుభప్రదం. పేదరికం నుండి బయటపడటానికి ఇది చాలా సహాయపడుతుంది. ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయట.
శని ప్రదోష సమయంలో శివలింగానికి గంగాజలాన్ని కొద్దిగా నీటిలో కలిపి, అందులో కొంచెం బియ్యం వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే ఋణ బాధలు తొలగిపోతాయి. ఆర్థికంగా లాభపడతారు. ఇలా చేసిన తరువాత నుండి విజయాలు వాటికవే మీ వెంట వస్తాయి. అయితే కష్టపడి పని చేయాలి సుమా..
ఇలా మాత్రం చెయ్యకండి..
సనాతన ధర్మంలో పసుపును పూజలు, శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. కానీ పసుపు, సింధూరం ను శివలింగానికి సమర్పించకూడదు అంట. ఒకవేళ సమర్పిస్తే పూజల పూర్తి ఫలాలను లభించవట.
*రూపశ్రీ.